జగన్‌ సింహంలా కనిపిస్తున్నాడు " పూరిజగన్నాథ్‌

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ అనుభవించనన్ని బాధలను, కష్టాలను అనుభవించిన జగన్‌ ఒక మొండి పట్టుదలతో ఎవరూ ఊహించని విజయాన్ని సాధించాడని ప్రముఖ సినీ దర్శకుడు పూరిజగన్నాథ్‌ అన్నారు. ఎన్నో అవమానాలను ఆయన ఎదుర్కొన్నప్పటికీ ఆయన కుంగిపోలేదని… ఇంత గొప్ప విజయం తరువాత కూడా ఆయన పొంగిపోలేదని, ఆయనలో కొంచెం కూడా విజయ గర్వం కనిపించడం లేదని, ఆయనది గొప్ప వ్యక్తిత్వమని ఆయన అన్నారు. అంత సంయమనంతో, హుందాగా ఉండడం జగన్‌కే సాధ్యమన్నారు. ఆయన పోరాటాల వల్లే […]

Advertisement
Update:2019-05-27 04:43 IST

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ అనుభవించనన్ని బాధలను, కష్టాలను అనుభవించిన జగన్‌ ఒక మొండి పట్టుదలతో ఎవరూ ఊహించని విజయాన్ని సాధించాడని ప్రముఖ సినీ దర్శకుడు పూరిజగన్నాథ్‌ అన్నారు.

ఎన్నో అవమానాలను ఆయన ఎదుర్కొన్నప్పటికీ ఆయన కుంగిపోలేదని… ఇంత గొప్ప విజయం తరువాత కూడా ఆయన పొంగిపోలేదని, ఆయనలో కొంచెం కూడా విజయ గర్వం కనిపించడం లేదని, ఆయనది గొప్ప వ్యక్తిత్వమని ఆయన అన్నారు.

అంత సంయమనంతో, హుందాగా ఉండడం జగన్‌కే సాధ్యమన్నారు. ఆయన పోరాటాల వల్లే ఎన్నికలు ఏకపక్షం అయ్యాయని, ఆయన వల్లే మా కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించగలిగిందని చెప్పారు. తన తమ్ముడు ఉమాశంకర్‌ కు నర్సీపట్నం అసెంబ్లీ టిక్కెట్‌ జగన్‌ ఇచ్చారని, జగన్‌ నాయకత్వం వల్లే మా తమ్ముడు గెలుపొందాడని…. జగన్‌ వల్లే నా తమ్ముడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడని… జగన్‌ పట్ల తన కృతజ్ఞతని వ్యక్తం చేశారు.

జగన్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఆయన అన్నారు. నేను రాజకీయాల్లో లేను కానీ రాజకీయాల్లో ప్రజల పక్షాన పోరాడేవాళ్ళంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటి పోరాట యోధుల్లో జగన్‌ నాకు సింహంలా కనిపిస్తున్నాడని పూరిజగన్నాథ్‌ అన్నాడు.

Tags:    
Advertisement

Similar News