జగన్‌ ఇప్పటికీ నాకు ఆత్మీయుడే

వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రెండు సార్లు ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన నేత. వైఎస్ తెరముందు రాజకీయం నడిపితే..తెరవెనుక ఆయన ప్రాణస్నేహితుడు.. ఆత్మగా పిలిచే కేవీపీ రాంచంద్రరావు వ్యవహారం నడిపేవారు. వీరిద్దరి స్నేహం…. వైఎస్ మృతితో దూరమైంది. ఆ తర్వాత జగన్ సొంతంగా పార్టీ పెట్టుకోవడం.. కాంగ్రెస్ కు దూరమవ్వడంతో జగన్, కేవీపీల మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తలు వచ్చాయి. అయితే జగన్‌కు తను ఎప్పుడూ సన్నిహితుడనేనని.. తమ మధ్య మంచి సంబంధాలున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]

Advertisement
Update:2019-05-23 01:23 IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రెండు సార్లు ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన నేత. వైఎస్ తెరముందు రాజకీయం నడిపితే..తెరవెనుక ఆయన ప్రాణస్నేహితుడు.. ఆత్మగా పిలిచే కేవీపీ రాంచంద్రరావు వ్యవహారం నడిపేవారు. వీరిద్దరి స్నేహం…. వైఎస్ మృతితో దూరమైంది. ఆ తర్వాత జగన్ సొంతంగా పార్టీ పెట్టుకోవడం.. కాంగ్రెస్ కు దూరమవ్వడంతో జగన్, కేవీపీల మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తలు వచ్చాయి.

అయితే జగన్‌కు తను ఎప్పుడూ సన్నిహితుడనేనని.. తమ మధ్య మంచి సంబంధాలున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేవీపీ రాంచంద్రరావు చెప్పుకొచ్చాడు. తాను వైఎస్ కలిసి చదువుకున్నప్పటి నుంచి.. వైఎస్ కు కొడుకుగా జగన్ పుట్టినప్పటి నుంచి తనకు తెలుసు అని.. మా మధ్య పార్టీల అంతరం తప్పితే…మంచి అనుబంధం ఉందని వివరించారు. అయితే కీలక రాజకీయ నిర్ణయాల్లో జగన్‌…. కేవీపీ సలహాలు కూడా తీసుకుంటాడన్న సంగతి కూడా తాజాగా బయటపడింది.

ఇక అమరావతిలోని తాడేపల్లిలో జగన్ నూతన గృహం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం లో కూడా కేవీపీ సతీమణి కీలక పాత్ర పోషించారు. ఈ వేడుక ఏర్పాట్లు, బాధ్యతలను పర్యవేక్షించారు. ఆమె అన్నీ తానై వ్యవహరించడం విశేషం.

అయితే కాంగ్రెస్ పార్టీనే నమ్మి అందులోనే ఉంటున్న కేవీపీ జగన్ పార్టీలో చేరలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటున్నారు. జగన్ తో మాత్రం మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారు. అయితే కేంద్రంలో హంగ్ వస్తుందన్న అంచనాలు.. జగన్ మద్దతు కాంగ్రెస్‌కు అవసరమన్న అభిప్రాయాలు కేంద్రంలో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆదేశిస్తే తాను జగన్ తో చర్చలు జరిపి కాంగ్రెస్ కు మద్దతు కోసం ప్రయత్నిస్తానని కేవీపీ చెప్పుకొచ్చారు. ఇలా తమ మధ్య దూరం లేదని.. ఇప్పటికీ అనుబంధం ఉందని కేవీపీ చెప్పడంతో ఇన్నాళ్ళ అపోహలు, అసత్య వార్తలకు చెక్ పడింది.

Tags:    
Advertisement

Similar News