ఫ్రెంచ్ ఓపెన్ లో భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
2019 విజేతలకు ఇక 8 శాతం అదనంగా నజరానా పురుషుల, మహిళల విజేతలకు 18 కోట్ల నజరానా మే 26 నుంచి జూన్ 9 వరకూ క్లే కోర్టు గ్రాండ్ సమరం గ్రాండ్ స్లామ్ టెన్నిస్ క్లేకోర్టు సమరంలో అతిపెద్ద టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ కు….పారిస్ లోని రోలాండ్ గారోస్ కాంప్లెక్స్ లో రంగం సిద్ధమయ్యింది. మే 26 నుంచి జూన్ 9 వరకూ జరిగే ఈ ఎర్రమట్టి యుద్ధంలో 11సార్లు విజేత రాఫెల్ నడాల్, సిమోనా […]
- 2019 విజేతలకు ఇక 8 శాతం అదనంగా నజరానా
- పురుషుల, మహిళల విజేతలకు 18 కోట్ల నజరానా
- మే 26 నుంచి జూన్ 9 వరకూ క్లే కోర్టు గ్రాండ్ సమరం
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ క్లేకోర్టు సమరంలో అతిపెద్ద టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ కు….పారిస్ లోని రోలాండ్ గారోస్ కాంప్లెక్స్ లో రంగం సిద్ధమయ్యింది.
మే 26 నుంచి జూన్ 9 వరకూ జరిగే ఈ ఎర్రమట్టి యుద్ధంలో 11సార్లు విజేత రాఫెల్ నడాల్, సిమోనా హాలెప్ డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నారు.
మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఈటోర్నీలో 2019 విజేతలకు 8శాతం అదనంగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు నిర్వహాక సంఘం ప్రకటించింది.
పురుషుల, మహిళల చాంపియన్లకు చెరో 18 కోట్ల రూపాయల చొప్పున నజరానాగా చెల్లిస్తారు.
మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధికంగా 26కోట్ల రూపాయలు చెల్లిస్తున్నది …యూఎస్ ఓపెన్ నిర్వాహక సంఘం మాత్రమే.
క్లోకోర్టు కింగ్ రాఫెల్ నడాల్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ ల మధ్యనే పురుషుల సింగిల్స్ లో పోటీ ప్రధానంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే 11సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన రాఫెల్ నడాల్ 12వ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాడు.