మహేష్ సినిమా విషయంలో అనిల్ రావిపూడి టార్గెట్ అదేనట

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తాజాగా ‘మహర్షి’ విజయోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో స్టార్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మరియు మహేష్ బాబు తదుపరి సినిమాకు దర్శకత్వం వహించబోతున్న అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేయడం […]

Advertisement
Update:2019-05-19 08:46 IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తాజాగా ‘మహర్షి’ విజయోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో స్టార్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మరియు మహేష్ బాబు తదుపరి సినిమాకు దర్శకత్వం వహించబోతున్న అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేయడం విశేషం.
తనకు అభిమానులు మరియు వెల్ విషర్స్ నుంచి బోలెడు మెసేజ్ లు ఫోన్స్ వస్తున్నాయి అని, ‘మహర్షి’ లాంటి పెద్ద హిట్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న నెక్స్ట్ సినిమా కాబట్టి తనపై ప్రెజర్ కూడా ఎక్కువగా ఉందని అందుకే అంచనాలను దాటేలా సినిమా ఉండేలాగా జాగ్రత్త పడాలని అనిల్ రావిపూడి అన్నారు.
అయినప్పటికీ తాను ప్రెజర్ కు లొంగే వాడిని కాదని మహర్షి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా తను మహేష్ బాబు తోనే ఉన్నానని అన్న అనిల్, “ఇకపై కూడా మహేష్ బాబు నవ్వు మరియు సంతోషమే నా మెయిన్ టార్గెట్” అని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Tags:    
Advertisement

Similar News