రవిప్రకాశ్, శివాజీలపై లుకౌట్ నోటీసు.. కావాలనే తప్పించుకొని తిరుగుతున్నారా..?

టీవీ9లో షేర్ల మార్పిడిలో అవకతవకలు, ఫోర్జరీ సంతకాలు, నిధుల అక్రమ మళ్లింపులకు కారకుడైన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, అతనికి సహకరించిన నటుడు శివాజీపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల విచారణకు హాజరుకావాలని గత కొన్ని రోజులుగా పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కదానికి కూడా వీరు స్పందించలేదు. పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. రవిప్రకాశ్, శివాజీ దేశం వదలి పారిపోకుండా ముందస్తు చర్యలు […]

Advertisement
Update:2019-05-18 10:56 IST

టీవీ9లో షేర్ల మార్పిడిలో అవకతవకలు, ఫోర్జరీ సంతకాలు, నిధుల అక్రమ మళ్లింపులకు కారకుడైన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, అతనికి సహకరించిన నటుడు శివాజీపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల విచారణకు హాజరుకావాలని గత కొన్ని రోజులుగా పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కదానికి కూడా వీరు స్పందించలేదు.

పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. రవిప్రకాశ్, శివాజీ దేశం వదలి పారిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అధికారులను అప్రమత్తం చేస్తూ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా వీరి కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నారు.

ఇక, రవిప్రకాశ్‌పై ఆరోపణలు వచ్చిన మే 9నాడు టీవీ9లో లైవ్‌కి వచ్చి అవన్నీ అబద్దాలేనని.. తనను ఎవరూ అరెస్టు చేయబోవడం లేదని చెప్పిన రవిప్రకాశ్ ఆనాటి నుంచి అందుబాటులో లేరు. అంతే కాకుండా తాను అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కనుక పోలీసు విచారణకు హాజరైతే.. తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపుతారు కనుక సాధ్యమైనంత వరకు అరెస్టు నుంచి తప్పించుకోవాలని రవిప్రకాశ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. అయితే తిరిగి యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 24న ఎన్‌సీఎల్టీ విచారణ జరిగే వరకు పోలీసుల విచారణ నుంచి దూరంగా ఉండటమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడని సన్నిహితులు వ్యాఖ్యానించారు. ఏదేమైనా వీరిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలంగాణ పోలీసులు ఎందుకు కనిపెట్టలేక పోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News