అంతుచిక్కని జగన్ అంతరంగం.... జుట్టుపీక్కుంటున్న జాతీయ పార్టీలు

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ అంటున్నాడు.. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ కట్టాడు. పక్కరాష్ట్రంలో స్టాలిన్ కాంగ్రెస్ వెంట నడుస్తున్నాడు. కానీ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంతరంగం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. జాతీయ నేతలు ఎంత ప్రయత్నించినా జగన్ మౌనం వీడడం లేదు.. .. దేశంలో ఈసారి హంగ్ వస్తుందన్న అంచనాలున్నాయి. బీజేపీకి 150-180 సీట్లు మాత్రమే వస్తాయంటున్నారు. ఇక కాంగ్రెస్ కు 150 సీట్లు రావచ్చు […]

Advertisement
Update:2019-05-16 01:31 IST

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ అంటున్నాడు.. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ కట్టాడు. పక్కరాష్ట్రంలో స్టాలిన్ కాంగ్రెస్ వెంట నడుస్తున్నాడు. కానీ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంతరంగం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

జాతీయ నేతలు ఎంత ప్రయత్నించినా జగన్ మౌనం వీడడం లేదు..

.. దేశంలో ఈసారి హంగ్ వస్తుందన్న అంచనాలున్నాయి. బీజేపీకి 150-180 సీట్లు మాత్రమే వస్తాయంటున్నారు. ఇక కాంగ్రెస్ కు 150 సీట్లు రావచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు కీలకం కాబోతున్నాయి. అవసరమైతే ప్రధాని పీఠంపై కూర్చోవడానికి కూడా ప్రాంతీయపార్టీలు రెడీ అయిపోయాయి.

కానీ వైఎస్ జగన్ మాత్రం ఎటూ తేల్చడం లేదు….

తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా వైఎస్ జగన్ కు లేఖ రాసిందని.. ఫోన్ లో మాట్లాడారని వార్తలు వచ్చాయి. కానీ వైసీపీ అధినేత మాత్రం మే 23న ఫలితాల తర్వాతే తన నిర్ణయాన్ని చెబుతానని స్పష్టం చేస్తున్నాడు. బీజేపీ ఆఫర్ ను కూడా అంతే స్థాయిలో దూరంగా పెడుతున్నాడు.

తాజాగా కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ను రంగంలోకి దింపి.. తటస్థంగా ఉన్న కేసీఆర్, జగన్ ల మద్దతు కోసం సంప్రదింపులు జరపడానికి రెడీ అయ్యిందట.. కానీ జగన్ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదాను రాతపూర్వకంగా ఇచ్చి అమలు చేసే పార్టీకే మద్దతు ఇస్తానంటున్నాడు. సో ఇలా అందరూ ఎటూవైపు నడిచినా జగన్ అడుగులు మాత్రం కేంద్రంలో ఎవరివైపు పడుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News