మహేష్ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు
మీడియా ముందు చాలా గుంభనంగా ఉంటాడు మహేష్. సాధారణంగా సినిమా వాళ్లు మాట్లాడే అతి భాషను మహేష్ ఉపయోగించడు. హిట్ అయితే థ్యాంక్స్ మాత్రం చెబుతుంటాడు. కానీ తన 25వ సినిమా మహర్షి విషయంలో మహేష్ కూడా కాస్త అతిగా రియాక్ట్ అయ్యాడేమో అనిపిస్తోంది. సక్సెస్ మీట్ లో మాట్లాడిన మహేష్, కాలర్ ఎగరేశాడు. “నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను వన్ వీక్‌లో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. ఆడియన్స్, నా అభిమానులకు హ్యాట్సాఫ్. […]
మీడియా ముందు చాలా గుంభనంగా ఉంటాడు మహేష్. సాధారణంగా సినిమా వాళ్లు మాట్లాడే అతి భాషను మహేష్ ఉపయోగించడు. హిట్ అయితే థ్యాంక్స్ మాత్రం చెబుతుంటాడు. కానీ తన 25వ సినిమా మహర్షి విషయంలో మహేష్ కూడా కాస్త అతిగా రియాక్ట్ అయ్యాడేమో అనిపిస్తోంది. సక్సెస్ మీట్ లో మాట్లాడిన మహేష్, కాలర్ ఎగరేశాడు.
“నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను వన్ వీక్‌లో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. ఆడియన్స్, నా అభిమానులకు హ్యాట్సాఫ్. ముందుగా నరేష్ గారికి థాంక్స్.. ఎందుకంటే, ఆయన ఈ క్యారెక్టర్‌ను చేస్తాడా? అనుకున్నాను. కానీ.. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. వంశీ గురించి చాలా విషయాలే చెప్పాను. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా అభిమానులు, నాన్నగారి అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా కాలర్ ఎత్తుకుంటున్నాను.”
ఇక్కడితో ఆగలేదు మహేష్. వరల్డ్ కప్ ఫైనల్ లో ధోనీ సిక్స్ కొట్టినప్పుడు ఎంత సంబరపడ్డానో, మహర్షి హిట్ అయినప్పుడు అంతకంటే ఎక్కువ సంబర పడ్డానని అన్నాడు. ఈ సినిమా తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చాడు.
“ఈ సినిమా మూడేళ్ల ప్రాసెస్. మరచిపోలేని అనుభవాలున్నాయి. దిల్‌రాజు గారు తొలిసారి కథ విని క్లాసిక్ అన్నారు. నాకు ఫోన్ చేశారు. గత ఏడాది దత్తుగారు కథ విని, ఈ సినిమా ఓ గేమ్ చేంజర్ అవుతుంది ప్రిన్స్ అన్నారు. డబుల్ చేంజర్ చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లాను. చివర్లో దోని సిక్స్ కొట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్‌రాజుగారు సిక్సర్ కొట్టాం అనగానే అంతే ఆనందం వేసింది.”
సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రస్తుతానికైతే వసూళ్లు బాగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రికార్డు వసూళ్లు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లో మాత్రం మహర్షి చతికిలపడింది.