అజ్ఞాతంలోకి టీవీ9 రవిప్రకాష్..!

ఫోర్జరీ, నిధుల బదిలీ వ్యవహారంలో చిక్కుకొని టీవీ9 సీఈవో పదవిని కోల్పోయిన రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్థారణకు వచ్చారు. తమ విచారణకు హాజరుకావాలని సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆయన తన న్యాయవాది ద్వారా 10 రోజుల గడువు కోరారు. కాని పోలీసులు మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే టీవీ9కు సంబంధించిన పలు అంశాలపై ఆధారాలు సేకరించే నిమిత్తం ప్రత్యేక పోలీసు బృందం శనివారం రవిప్రకాష్ ఇంటికి వెళ్లారు. అక్కడ […]

Advertisement
Update:2019-05-12 02:40 IST

ఫోర్జరీ, నిధుల బదిలీ వ్యవహారంలో చిక్కుకొని టీవీ9 సీఈవో పదవిని కోల్పోయిన రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్థారణకు వచ్చారు. తమ విచారణకు హాజరుకావాలని సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆయన తన న్యాయవాది ద్వారా 10 రోజుల గడువు కోరారు. కాని పోలీసులు మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదు.

అయితే టీవీ9కు సంబంధించిన పలు అంశాలపై ఆధారాలు సేకరించే నిమిత్తం ప్రత్యేక పోలీసు బృందం శనివారం రవిప్రకాష్ ఇంటికి వెళ్లారు. అక్కడ అతని గురించి వాకబు చేయగా.. కుటుంబ సభ్యులు ఏమీ చెప్పలేదు. రవిప్రకాష్ ఎక్కడికి వెళ్లారో తెలియదని.. మాకు ఏమీ చెప్పలేదని వారు చెప్పారు. మరోవైపు రవిప్రకాష్ సన్నిహితులు, టీవీ9 ఉద్యోగులను ప్రశ్నించినా అదే సమాధానం వచ్చింది.

శనివారం అంతా పోలీసులు రవిప్రకాష్ కు ఫోన్ చేస్తూనే ఉన్నా ఆయన సెల్ స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే నిర్థారణకు సైబర్ క్రైం పోలీసులు వచ్చారు. దీంతో వెంటనే అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

రవిప్రకాష్ తో పాటు నోటీసులు అందుకున్న నటుడు శివాజీ కూడా విచారణకు హాజరుకాకపోవడంతో అతనికి మరో సారి నోటీసులు పంపారు.

Tags:    
Advertisement

Similar News