రాజకీయాల్లోకి రవిప్రకాష్‌ ?

మన దేశంలో లిఖించబడని ఒక చట్టం ఉంది. ఏ రంగంలోనైనా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని.. కాస్త డబ్బు సంపాదిస్తే చివరికి వాళ్లు ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చేస్తారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఎందరో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రాణించారు. జర్నలిస్టులు కూడా వీరికి అతీతం కాదు. మన దేశంలో కూడా ఎంజే అక్బర్, అరుణ్ శౌరీ, రాజీవ్ శుక్లా, చందన్ మిత్రా, షజియా ఇల్మీ, మనీష్ సిసోడియా, ఆశిష్ ఖేతాన్ వంటి వారు రాజకీయాల్లోకి […]

Advertisement
Update:2019-05-12 06:31 IST

మన దేశంలో లిఖించబడని ఒక చట్టం ఉంది. ఏ రంగంలోనైనా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని.. కాస్త డబ్బు సంపాదిస్తే చివరికి వాళ్లు ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చేస్తారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఎందరో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రాణించారు. జర్నలిస్టులు కూడా వీరికి అతీతం కాదు.

మన దేశంలో కూడా ఎంజే అక్బర్, అరుణ్ శౌరీ, రాజీవ్ శుక్లా, చందన్ మిత్రా, షజియా ఇల్మీ, మనీష్ సిసోడియా, ఆశిష్ ఖేతాన్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి దిగ్విజయంగా రాణిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా కే. కేశవరావు వంటి వారు ఉన్నత స్థితికి చేరారు. ఇటీవల టీవీ9 గ్రూప్‌కు చెందిన టీవీ1 ఎడిటర్ చంటి క్రాంతి కిరణ్ కూడా టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా మారారు.

ఇక ఇప్పుడు మరో జర్నలిస్టు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ వంతు వచ్చింది. గత మూడు రోజులుగా టీవీ9లో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సీఈవోగా ఉంటూ సంస్థ నిధులు మళ్లించడం, ఫోర్జరీ సంతకాలతో షేర్ హోల్డర్లను మోసం చేయడం వంటి కేసుల్లో ఇరుక్కున్నారు. దీంతో ఆయనను టీవీ9 సీఈవోగా తొలగించారు. అయితే మూడు రోజులుగా రవిప్రకాష్‌ పోలీసులకు కూడా చిక్కడం లేదు.

ఇదిలా ఉండగా, రవిప్రకాష్‌ త్వరలోనే పొలిటికల్ అరంగేట్రం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన రవిప్రకాష్‌ పుట్టింది మాత్రం కోల్‌కత. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవిప్రకాష్‌ జర్నలిస్టుగానే కాక.. తన స్వచ్చంద సంస్థ ద్వారా పెద్ద ఆసుపత్రిని నిర్మించారు.

ఈ ఆసుపత్రి నిర్మాణంలో కూడా నిధుల వ్యవహారంలో రవిప్రకాష్‌ పై పలు ఆరోపణలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేశారట. ఇదంతా పొలిటికల్ ఎంట్రీలో భాగమేనని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే రవిప్రకాష్‌ రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని.. ఇప్పడు వచ్చిన వివాదాలు సద్దుమణిగిన తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారని ఏపీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా అనేది తెలియాలంటే రవిప్రకాష్‌ ముందు ఈ వివాదాల నుంచి బయటపడాల్సిందే. ఆయన మిత్రులు మాత్రం రవిప్రకాష్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News