చంద్రబాబు కు మమత చెక్ వెనుక కారణమిదే....
ఏపీలో గెలుస్తాడో లేదో తెలియదు.. అందుకే వ్యూహాత్మకంగా మే 21న తన పరపతి ఉండగానే సమావేశం పెట్టి రాహుల్ ను ప్రధానిగా చేయాలని స్కెచ్ గీశాడు. కానీ బ్యాడ్ లక్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారు. అయితే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని గ్రహించిన మమతా బెనర్జీ ఇలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముందే సమావేశం పెడితే తర్వాత ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలకు నష్టం జరుగుతుంది. […]
ఏపీలో గెలుస్తాడో లేదో తెలియదు.. అందుకే వ్యూహాత్మకంగా మే 21న తన పరపతి ఉండగానే సమావేశం పెట్టి రాహుల్ ను ప్రధానిగా చేయాలని స్కెచ్ గీశాడు. కానీ బ్యాడ్ లక్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారు.
అయితే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని గ్రహించిన మమతా బెనర్జీ ఇలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముందే సమావేశం పెడితే తర్వాత ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలకు నష్టం జరుగుతుంది. అందుకే వ్యూహాత్మకంగా మే 23 ఫలితాల తర్వాత సమావేశం పెట్టింది.
అయితే ఈ సమావేశానికి కారణం లేకపోలేదు.. కేసీఆర్, మమతా బెనర్జీ ప్లాన్లు వేరే ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ సాయం తీసుకొని రాహుల్ ప్రధాని కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమినే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా మమతా బెనర్జీ వ్యూహం పన్నినట్లు సమాచారం. కాంగ్రెస్ కు ఒకవేళ తక్కువ సీట్లు వస్తే కర్ణాటకలో వలే ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కాంగ్రెస్ సాయంతో చక్రం తిప్పేలా ఇలా ప్లాన్ చేసినట్టు విశ్వసనీయం సమాచారం.
ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంగా కేసీఆర్, వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ లు ఉన్నారు. ఈ ఆరు పార్టీలు ఏకమైతే కేంద్రంలో ఈజీగా చక్రం తిప్పవచ్చు. ఈ ఆరు రాష్ట్రాల్లో 185 లోక్ సభ స్థానాలున్నాయి.
కాంగ్రెస్ కు సీట్లు తగ్గి.. ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తే రాహుల్ గాంధీని కాకుండా మరోనేతను ప్రధానిగా ఎన్నుకోవచ్చని…. అదే తనే కావచ్చని మమతా యోచిస్తోంది. ఇక ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తే మాయవతి రేసులో ఉండొచ్చు. ఇలా ముందే రాహుల్ ను ప్రధానిగా ప్రకటించడానికి మమత సిద్ధపడలేదని సమాచారం.