మిరియాలు.... ఆరోగ్య దినుసులు

వంటింటి పోపుల పెట్టేలో ఉండే మరో ముఖ్యమైన వంట దినుసు మిరియాలు. వీటిని బ్లాక్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్నా ఘాటు మాత్రం చాలా ఎక్కువ. సుగంధ ద్రవ్యాలలో మిరియాలకు ప్రత్యేక స్దానం ఉంది. ఇవి భారత దేశంలో ఎక్కువగా పండుతాయి. నల్లమిరియాలను నానపెట్టి దాని పొట్టు తీస్తే వచ్చేవే తెల్లమిరియాలు. ఆహారంలో రుచికి ఇవి ఎక్కువగా వాడతారు. అయితే ఆయర్వేద ఔషధాలు తయారు చేయడంలో కూడా వీటికి ప్రత్యేక స్దానం […]

Advertisement
Update:2019-05-10 04:37 IST

వంటింటి పోపుల పెట్టేలో ఉండే మరో ముఖ్యమైన వంట దినుసు మిరియాలు. వీటిని బ్లాక్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్నా ఘాటు మాత్రం చాలా ఎక్కువ. సుగంధ ద్రవ్యాలలో మిరియాలకు ప్రత్యేక స్దానం ఉంది. ఇవి భారత దేశంలో ఎక్కువగా పండుతాయి. నల్లమిరియాలను నానపెట్టి దాని పొట్టు తీస్తే వచ్చేవే తెల్లమిరియాలు. ఆహారంలో రుచికి ఇవి ఎక్కువగా వాడతారు. అయితే ఆయర్వేద ఔషధాలు తయారు చేయడంలో కూడా వీటికి ప్రత్యేక స్దానం ఉంది. మిరియాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

  • మిరియాలలో కొవ్వును కరిగించే గుణాలు అధికంగా ఉన్నాయి. శరీరంలో పలు చోట్ల పేరుకుపోయిన కొవ్వును ఇవి కరిగిస్తాయి.
  • రక్తంలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తాయి కాబట్టి బీపీ అదుపులో ఉంటుంది.
  • అజీర్ణంతో బాధపడుతున్న వారు మిరియాల చారు తాగితే వెంటనే సుఖ విరోచనం అవుతుంది.
  • మిరియాలు పొడి, ఉప్పు కలిపి పళ్లు తోముకుంటే దంతసమస్యలు ఉండవు.
  • వాన కాలంలో వచ్చే వ్యాధులను మిరియాలు అరికడతాయి. జలుబు, దగ్గు, గొంతులో నొప్పి వంటి వాటికి మిరియాలకు మించిన ఔషధం లేదు.
  • అధిక వొత్తిడితో బాధపడుతున్న వారు వేడి వేడి పాలలో కొద్దిగా మిరియాల పొడిని వేసుకుని తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
  • ఇందులో ఉన్న విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • మిరియాలు కఫం, శ్లేష్మాలను కరిగిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి.
  • ప్రతిరోజూ ఆహారంలో మిరియాలను చేర్చుకుని తింటే నరాల బలహీనత, నరాలకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.
  • మిరియాలు నూరి చిన్న చిన్న ఉండలు చేసి కలరాతో బాధపడుతున్న వారికి తినిపిస్తే మంచి ఫలితం కనబడుతుంది.
  • ఆకలితో పొట్ట మందగిస్తే కొన్ని మిరియాలు రసం కాని, కషాయం కాని తాగితే ఆకలి పుడుతుంది.
  • మిరియాలతో చేసిన టీ తాగితే గుండె సమస్యలు దరి చేరవు.
  • పెరుగుతో మిరియాలు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
  • మిరియాలను బాగ వేయించి పొడి చేసి, ఆ పొడిని నూనెలో కలిపి మర్దన చేస్తే కీళ్లనొప్పులు, అరికాళ్ల మంటలు తగ్గుతాయి.
  • మిరియాలను నలగొట్టి పెరుగులో కలుపుకుని ముఖానికి మసాజ్ చేస్తే ముఖం పై ఉన్న డెడ్ స్కిన్ ను తొలగించమే కాకుండా మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
Tags:    
Advertisement

Similar News