దిల్ రాజు ప్రెస్ మీట్ ఎందుకో తెలుసా?

మహర్షి సినిమాకు సంబంధించి జోరుగా ప్రచారం సాగుతోంది. టీవీలో, పేపర్లలో యాడ్స్ వస్తున్నాయి. హీరో మహేష్ బాబు స్వయంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అన్నీ జోరుగా సాగుతున్న వేళ, సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టారు నిర్మాత దిల్ రాజు. ఓవైపు ఏకంగా హీరో, హీరోయిన్లే ప్రచారం ఇస్తున్న టైమ్ లో సోలోగా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సెడన్ గా ఆయన ప్రెస్ ను పిలిచారు. దీని వెనక ఓ  […]

Advertisement
Update:2019-05-08 12:09 IST

మహర్షి సినిమాకు సంబంధించి జోరుగా ప్రచారం సాగుతోంది. టీవీలో, పేపర్లలో యాడ్స్ వస్తున్నాయి. హీరో మహేష్ బాబు స్వయంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అన్నీ జోరుగా సాగుతున్న వేళ, సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టారు నిర్మాత దిల్ రాజు. ఓవైపు ఏకంగా హీరో, హీరోయిన్లే ప్రచారం ఇస్తున్న టైమ్ లో సోలోగా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సెడన్ గా ఆయన ప్రెస్ ను పిలిచారు. దీని వెనక ఓ కారణం ఉంది.

తెలంగాణలో మహర్షి సినిమాకు సంబంధించి థియేటర్లలో టిక్కెట్ రేట్లు పెంచారు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం అనుమతితోనే ఎగ్జిబిటర్లు ఇలా టిక్కెట్ రేట్లు పెంచారంటూ ప్రచారం సాగింది. దీనిపై కేసీఆర్ సర్కార్ గుస్సా అయింది. ఏకంగా మంత్రి తలసాని దీనిపై స్పందించారు. తమ ప్రమేయం లేకుండా టిక్కెట్ రేట్లు ఎలా పెంచారంటూ మీడియా ముందుకొచ్చారు. దీంతో దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.

తెలంగాణలో థియేటర్ల టిక్కెట్ రేట్లు పెంచడానికి, కేసీఆర్ సర్కార్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు దిల్ రాజు. ఎగ్జిబిటర్లంతా కోర్టుకు వెళ్లి, ప్రత్యేక అనుమతి తెచ్చుకొని టిక్కెట్ రేట్లు పెంచుకున్నారని స్పష్టంచేశారు. తెలంగాణ సర్కార్ కేవలం అదనంగా ఐదో షో వేసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని తెలిపారు.

ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు క్లారిటీ ఇచ్చినప్పటికీ తెలంగాణ సర్కార్ శాంతించలేదు. అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలో టిక్కెట్ రేట్లు ఎలా పెంచుతారంటూ తలసాని ప్రశ్నించారు. ఈ విషయంలో కోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత ఎగ్జిబిటర్లపై ఉందని, ఈ విషయంపై ప్రభుత్వం తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. ఈ వివాదం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News