అది తమ అసమర్థత " మోహన్ బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి టాలెంట్ అకాడమీ వారు ఒక షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను నిర్వహించారు. ఈ కాంటెస్ట్ లో గెలిచిన వారికి మోహన్ బాబు, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్, ఆర్.నారాయణమూర్తి మరియు సి కళ్యాణ్ బహుమతులు ఇచ్చారు. మొదటి స్థానం గెలుచుకున్న ‘పసుపు కుంకుమ’ అనే షార్ట్ ఫిలిం కి 100000 నగదు బహుమతి, రెండవ స్థానం దక్కించుకున్న ‘మాతృదేవోభవ’ అనే షార్ట్ ఫిలిం కు 50,000, మూడవ స్థానం లో […]
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి టాలెంట్ అకాడమీ వారు ఒక షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను నిర్వహించారు. ఈ కాంటెస్ట్ లో గెలిచిన వారికి మోహన్ బాబు, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్, ఆర్.నారాయణమూర్తి మరియు సి కళ్యాణ్ బహుమతులు ఇచ్చారు.
మొదటి స్థానం గెలుచుకున్న ‘పసుపు కుంకుమ’ అనే షార్ట్ ఫిలిం కి 100000 నగదు బహుమతి, రెండవ స్థానం దక్కించుకున్న ‘మాతృదేవోభవ’ అనే షార్ట్ ఫిలిం కు 50,000, మూడవ స్థానం లో నిలిచిన ‘తాత మనవడు’ కు 25000 అందజేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… “నేను గురువు గారిని కలిసినప్పుడల్లా మీ నీడలోనే మేము ఉండాలి అని అంటుండేవాడిని. అప్పుడు దాసరి నేను చనిపోతే అన్నీ నువ్వే చూసుకోవాలని అనేవారని…. ఆయన వీలునామా కూడా నాకు, మురళీ మోహన్ కి రాశారు. మేమే ఆస్తుల పంపకాలు చేయాలనేది ఆయన ఆలోచన. కానీ అలా చేయలేక పోయాం. అది మా అసమర్ధత” అని ఎమోషనల్ అయ్యారు మోహన్ బాబు.
అంతే కాకుండా దాసరి టాలెంట్ అకాడమీ నుండి ఒక విద్యార్థికి తమ విద్యా సంస్థలో ఎల్ కేజీ నుండి ప్లస్ టు వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.