ఎవరు జాగ్రత్తగా ఉండాలి బాబూ...!

ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గెలిచేది తామేనని, వైసీపీ నేతలు కావాలని హడావుడి చేస్తున్నారని పార్టీ సమావేశాలలో చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఫలితాల వేళ తాము జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారని సమాచారం. ఎక్కడా గెలుపు అవకాశాలు లేవనే సూచనలు కనిపిస్తున్న దశలో అధినేత మాటలు విని నాయకులు, కార్యకర్తలు విస్తుపోతున్నారట. చంద్రబాబు నాయుడు జరిపిన ప్రతి సమీక్షా సమావేశంలోనూ టీడీపీ గెలిచే అవకాశాలు […]

Advertisement
Update:2019-05-06 06:30 IST

ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గెలిచేది తామేనని, వైసీపీ నేతలు కావాలని హడావుడి చేస్తున్నారని పార్టీ సమావేశాలలో చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిసింది.

అందుకే ఫలితాల వేళ తాము జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారని సమాచారం. ఎక్కడా గెలుపు అవకాశాలు లేవనే సూచనలు కనిపిస్తున్న దశలో అధినేత మాటలు విని నాయకులు, కార్యకర్తలు విస్తుపోతున్నారట.

చంద్రబాబు నాయుడు జరిపిన ప్రతి సమీక్షా సమావేశంలోనూ టీడీపీ గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతూనే వస్తున్నారట. అయినా అధినేత అలా మాట్లాడడమేమిటో తెలియక వారు అయోమయానికి గురవుతున్నారని అంటున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో సైలెంట్ ఓటింగ్ జరిగిందని, పసుపు కుంకుమ ద్వారా లబ్ధి పొందిన మహిళలు, రైతుబంధు సాయం పొందిన రైతులు, ఫించను తీసుకున్న వృద్ధులు గుట్టు చప్పుడు కాకుండా తమకే ఓటు వేశారని ఢంకా బజాయించి చెబుతున్నారట. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి అవకాశాలు ఏమీ కనిపించడం లేదని టీడీపీ నేతలు వాపోతున్నారని అంటున్నారు.

అధినేత మాటలతో తమకు కూడా ఏ మూలో ఆశలు మిణుకు మిణుక్కుమంటున్నా, వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఢీలా పడిపోతున్నారని అంటున్నారు. ఫలితాలు వచ్చే దాకా ఈ టెన్షన్ ను తాము ఎలా భరించాలో తెలియడం లేవంటున్నారట.

ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులు కేసీఆర్ మీద కసితో భారీ సంఖ్యలో తరలి వచ్చి సైకిల్ కు ఓటు వేశారని చంద్రబాబు చెప్పడం కొత్త వివాదానికి దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, అంతా కలిసిమెలిసే ఉంటున్నారని, చిన్న సంఘటన కూడా జరగలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరి కాదని అంటున్నారు.

పార్టీ శ్రేణులు నిరుత్సాహ పడకుండా విజయం గురించి మాట్లాడడం సహేతుకమే అయినా, బాబు మాత్రం విపరీత వ్యాఖ్యానాలే చేస్తున్నారని అంటున్నారు. రేపు ఫలితాలు విరుద్ధంగా వస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతామని పార్టీ నేతలే మదన పడడం దీనికి కొస మెరుపు.

Tags:    
Advertisement

Similar News