లోటస్‌పాండ్‌లో సీనియర్లకు సీరియస్ క్లాస్ తీసుకున్న జగన్?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న ముగిసిన తర్వాత పలు రకాల విశ్లేషణలు బయటకు వచ్చాయి. ఓటింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగన్, ఎన్నికల్లో మేం విజయం సాధించబోతున్నామనే ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత జగన్ మీడియా ముందుకు రాలేదు. తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. కేవలం ఒకటి, రెండు సార్లు ట్విట్టర్ ద్వారా సందేశాలు ఇచ్చారు తప్ప ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జగన్ ఒక్క మాట […]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న ముగిసిన తర్వాత పలు రకాల విశ్లేషణలు బయటకు వచ్చాయి. ఓటింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగన్, ఎన్నికల్లో మేం విజయం సాధించబోతున్నామనే ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత జగన్ మీడియా ముందుకు రాలేదు. తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. కేవలం ఒకటి, రెండు సార్లు ట్విట్టర్ ద్వారా సందేశాలు ఇచ్చారు తప్ప ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు.
మరోవైపు చంద్రబాబు రోజుకో సారి గెలుపు మాదేనంటూ చెబుతున్నారు. మరోవైపు ఈవీఎంలు సరిగా పని చేయలేదని, ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని పలు విరుద్ద ప్రకటనలు చేశారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలమనీ.. 120 సీట్లు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఫలానా సీనియర్ నాయకుడికి ఈ శాఖ మంత్రిగా, మరో సీనియర్ నేత హోం మంత్రి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా, కొంత మంది సీనియర్లు కూడా తమకు మంత్రి పదవి ఖాయమని సన్నిహితుల వద్ద మాట్లాడారట. ఒక నాయకుడైతే నాకు టీటీడీ పదవి వచ్చేస్తుందని చెప్పాడట. ఇవే విషయాలు అధినేత జగన్ వద్దకు చేరాయి. సదరు సీనియర్ నాయకులను వెంటనే హైదరాబాద్ పిలిపించుకున్నారట జగన్.
ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మౌనంగా ఉండమని చెప్పినా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని జగన్ సీరియస్ అయ్యారట. పార్టీలో సీనియర్లు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని.. హుందాగా వ్యవహరించాల్సిన చోట ఇలా మాట్లాడటం పార్టీకి నష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారట.
దీంతో ఇకపై ఇలా మాట్లాడమని జగన్‌కు చెప్పారట. ఈ విషయం పార్టీలో కార్యకర్తలకు కూడా తెలియడంతో…. సీనియర్లు ఇలా ప్రచారం చేసుకోవడాన్ని ఆదిలోనే నిలువరించడం ద్వారా నష్టాన్ని పూడ్చారని అనుకుంటున్నారట.