కాంచన-3కి తమన్ పాటలు ఇవ్వలేదట!

ప్రస్తుతం థియేటర్లలో కాంచన-3 సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా హిట్ అయింది ఈ మూవీ. ఈ సినిమాకు తమన్ అదిరిపోయే రేంజ్ లో సంగీతం అందించాడు. కాస్త ఆగండి.. ఇక్కడే వ్యవహారం తేడా కొడుతోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించలేదంటున్నాడు లారెన్స్. అవును.. కాంచన-3కి తమన్ సంగీత దర్శకుడు కాదంట. అన్నీ తానై లారెన్స్ తీసిన కాంచన-3 సినిమాకు పాటలు కంపోజ్ చేసే పనిని ఓ థర్డ్ పార్టీకి […]

Advertisement
Update:2019-04-25 02:57 IST

ప్రస్తుతం థియేటర్లలో కాంచన-3 సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా హిట్ అయింది ఈ మూవీ. ఈ సినిమాకు తమన్ అదిరిపోయే రేంజ్ లో సంగీతం అందించాడు. కాస్త ఆగండి.. ఇక్కడే వ్యవహారం తేడా కొడుతోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించలేదంటున్నాడు లారెన్స్. అవును.. కాంచన-3కి తమన్ సంగీత దర్శకుడు కాదంట.

అన్నీ తానై లారెన్స్ తీసిన కాంచన-3 సినిమాకు పాటలు కంపోజ్ చేసే పనిని ఓ థర్డ్ పార్టీకి అప్పగించారట. వాళ్ల దగ్గర ఔత్సాహిక సంగీత దర్శకులు కంపోజ్ చేసిన వేల కొద్దీ పాటలు ఉంటాయట. మన సందర్భానికి తగ్గట్టు మెలొడీ, హారర్, రొమాన్స్, సస్పెన్స్.. ఇలా ఏ పాట కావాలంటే ఆ పాట సెలక్ట్ చేసుకోవడమే. ఆ కంపెనీ నుంచి కాంచన-3 కోసం 6 పాటలు తీసుకున్నానని స్పష్టంచేశాడు లారెన్స్. అంతే తప్ప తమన్ ఈ సినిమాకు ఒక్క పాట కూడా ఇవ్వలేదంటున్నాడు.

అయితే కాంచన-3కి, తమన్ కు మాత్రం సంబంధఁ ఉందంటున్నాడు లారెన్స్. సినిమాకు పాటలు ఇవ్వకపోయినా, బ్యాక్ గ్రౌండ్ ఇచ్చింది మాత్రం తమనే అని ఒప్పుకున్నాడు. అలా కాంచన-3 వెనకున్న ఓ గమ్మత్తైన విషయాన్ని లారెన్స్ బయటపెట్టాడు.

Tags:    
Advertisement

Similar News