వరుసగా ఆరోసారి ఆ ఘనత సాధించిన నాని

ఓవర్సీస్ లో నానికి ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నాని సినిమా ఓ మోస్తరుగా క్లిక్ అయిందంటే చాలు, ఓవర్సీస్ లో అది కాసుల వర్షం కురిపిస్తుంది. జెర్సీ సినిమా మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అప్పుడే అక్కడ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైపోయింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని జెర్సీ సినిమా 10 లక్షల డాలర్లు ఆర్జించింది. అంటే కేవలం […]

Advertisement
Update:2019-04-25 02:59 IST
వరుసగా ఆరోసారి ఆ ఘనత సాధించిన నాని
  • whatsapp icon

ఓవర్సీస్ లో నానికి ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నాని సినిమా ఓ మోస్తరుగా క్లిక్ అయిందంటే చాలు, ఓవర్సీస్ లో అది కాసుల వర్షం కురిపిస్తుంది. జెర్సీ సినిమా మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అప్పుడే అక్కడ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైపోయింది.

నిన్నటి వసూళ్లతో కలుపుకొని జెర్సీ సినిమా 10 లక్షల డాలర్లు ఆర్జించింది. అంటే కేవలం 5 రోజుల్లోనే జెర్సీ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైందన్నమాట. నాని కెరీర్ లో ఈ ఘనత సాధించిన ఆరో సినిమాగా నిలిచింది జెర్సీ. ఇంతకుముందు నేచురల్ స్టార్ నటించిన భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, నిన్నుకోరి, నేను లోకల్, ఈగ సినిమాలు మిలియన్ డాలర్ వసూళ్లు సాధించాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జెర్సీ హవా అంతగా కనిపించడం లేదు. ఇక్కడ ఈ సినిమా హిట్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఏపీ,నైజాంలో ఈ సినిమాను 20 కోట్లకు అటుఇటుగా అమ్మారు. ఈ వారం గడిస్తే కానీ బ్రేక్-ఈవెన్ అవుతుందో లేదో చెప్పలేం. నాని సినిమాకు కాంచన-3 కొరకరాని కొయ్యలా మారింది. మరికొన్ని రోజుల్లో ఎవెంజర్స్ కూడా వస్తోంది.

Tags:    
Advertisement

Similar News