బాల సినిమాలో బిందు మాధవి?

తమిళ నాట బాల ఎంత పెద్ద దర్శకుడో తెలిసిందే. ఆయన చేసిన సినిమాలు ఎన్నో బ్లాక్ బాక్టర్ హిట్ కొట్టాయి. కొన్ని సినిమాలకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ఇటీవలే అర్జున్ రెడ్డి రీమేక్ నుండి తప్పుకున్న బాల తన తదుపరి చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు. ముందుగా ఒక స్టార్ హీరో తో సినిమా చేద్దాం అనుకున్న ఈ దర్శకుడు మళ్ళి తన ఆలోచన ని మార్చుకొని ఇప్పుడు ఒక చిన్న […]

Advertisement
Update:2019-04-23 08:55 IST

తమిళ నాట బాల ఎంత పెద్ద దర్శకుడో తెలిసిందే. ఆయన చేసిన సినిమాలు ఎన్నో బ్లాక్ బాక్టర్ హిట్ కొట్టాయి. కొన్ని సినిమాలకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి.

అయితే ఇటీవలే అర్జున్ రెడ్డి రీమేక్ నుండి తప్పుకున్న బాల తన తదుపరి చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు. ముందుగా ఒక స్టార్ హీరో తో సినిమా చేద్దాం అనుకున్న ఈ దర్శకుడు మళ్ళి తన ఆలోచన ని మార్చుకొని ఇప్పుడు ఒక చిన్న బడ్జెట్ చిత్రం తో మన ముందుకు రానున్నాడు.

ఈ సినిమా ని తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ దర్శకుడి తదుపరి చిత్రం లో ఆర్య, అథర్వ ల ను హీరోలుగా నిర్ణయించాడట దర్శకుడు. అయితే హీరోయిన్ విషయానికి వస్తే ఈ సినిమా లో ఆవకాయ్ బిర్యాని భామ బిందు మాధవి ని తీసుకునే ఆలోచనలో బాల ఉన్నాడట.

బిందు మాధవి తమిళ ప్రేక్షకులకి కొత్త ఏమి కాదు. అందుకే బాల ఆమె ని తీసుకోవాలనుకుంటున్నాడట. అతి త్వరలో ఈ సినిమా గురించి అధికారిక సమాచారాన్ని దర్శక నిర్మాతలు మీడియా కి విడుదల చేయనున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే మళ్ళి బిందు కి వరుసగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News