వాల్మీకిలో స్టార్ హీరోయిన్

వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను తీసుకున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వరుణ్ తేజ్ లవర్ గా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే రాకతో వాల్మీకి సినిమాకు మరో స్టార్ […]

Advertisement
Update:2019-04-22 10:20 IST

వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను తీసుకున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వరుణ్ తేజ్ లవర్ గా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా కనిపించనున్న విషయం తెలిసిందే.

పూజా హెగ్డే రాకతో వాల్మీకి సినిమాకు మరో స్టార్ ఎట్రాక్షన్ తోడైనట్టయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు వరుణ్ తేజ్ మాత్రమే స్టార్ ఎట్రాక్షన్ గా ఉన్నాడు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా వచ్చి చేరింది. అయితే సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నది. అటుఇటుగా ఓ 15 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. ఓ 15 రోజుల కాల్షీట్లు ఇస్తే సరిపోతుందట. ప్రస్తుతం బిజీగా ఉన్న పూజా హెగ్డే, తక్కువ కాల్షీట్లు కాబట్టే ఈ సినిమాకు అంగీకరించిందట.

దర్శకుడు హరీష్ శంకర్ కు పూజా హెగ్డే కొత్తకాదు. గతంలో ఆమెతో డీజే సినిమా చేశాడు హరీష్. ఆ సినిమాతోనే పూజాకు స్టార్ డమ్ వచ్చింది. అంతకుముందు ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. వాల్మీకి సినిమాను పూజా హెగ్డే ఒప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News