జెర్సీ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

నాని, శ్రద్ధా శ్రీనాధ్ హీరోహీరోయిన్లుగా నటించిన జెర్సీ సినిమా ఊపందుకుంది. మొదటి రోజుకే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ క్లాస్ మూవీ కావడంతో అందుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. శనివారం నుంచి ఈ సినిమాకు వసూళ్లు పెరిగాయి. అలా విడుదలైన ఈ 3 రోజుల్లో జెర్సీ సినిమా 10 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 26 కోట్ల రూపాయలకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ మూవీ 20 కోట్ల రూపాయల […]

Advertisement
Update:2019-04-22 10:31 IST

నాని, శ్రద్ధా శ్రీనాధ్ హీరోహీరోయిన్లుగా నటించిన జెర్సీ సినిమా ఊపందుకుంది. మొదటి రోజుకే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ క్లాస్ మూవీ కావడంతో అందుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. శనివారం నుంచి ఈ సినిమాకు వసూళ్లు పెరిగాయి. అలా విడుదలైన ఈ 3 రోజుల్లో జెర్సీ సినిమా 10 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ సాధించింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాను 26 కోట్ల రూపాయలకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ మూవీ 20 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికి సగం వచ్చింది. మరో 10 కోట్లు రావాలి. అంటే.. ఇవాళ్టి నుంచి సినిమా ఇదే టాక్ తో కనీసం 5 రోజులైనా ఆడితే అప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆ తర్వాత కూడా మరో వారం నిలబడితే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది.

రాబోయే రోజుల్లో బడా సినిమాలేవీ లేవు. ఉన్నంతలో అవెంజర్స్-ఎండ్ గేమ్ ఒక్కటే భారీస్థాయిలో రిలీజ్ అవుతోంది. మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా జెర్సీకి పోటీగా నిలబడే ఛాన్స్ ఉంది. సో.. బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే జెర్సీకి ఉన్నది ఈ 5 రోజుల టైమ్ మాత్రమే. లాభాల సంగతి ఆ తర్వాత మాట. ఇక ఏపీ, నైజాంలో జెర్సీకి ఈ 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 4.92 కోట్లు
సీడెడ్ – రూ. 1 కోటి
ఉత్తరాంధ్ర – రూ. 1.31 కోట్లు
ఈస్ట్ – రూ. 0.86 కోట్లు
వెస్ట్ – రూ. 0.63 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 0.77 కోట్లు
నెల్లూరు – రూ. 0.36 కోట్లు

Tags:    
Advertisement

Similar News