కేసీఆర్ బయోపిక్ పై మరింత క్లారిటీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి ఎగ్రెసివ్ గాంధీ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి వర్మ విడుదల చేసిన ఓ డైలాగ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఆ డైలాగ్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా ప్రజల పాత్రపై క్లారిటీ ఇచ్చాడు వర్మ. కేసీఆర్ బయోపిక్ లో ఆంధ్రా ప్రజల్ని వర్మ విలన్లుగా చూపించబోతున్నాడంటూ దుమారం చెలరేగింది. […]

Advertisement
Update:2019-04-20 08:10 IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి ఎగ్రెసివ్ గాంధీ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి వర్మ విడుదల చేసిన ఓ డైలాగ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఆ డైలాగ్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా ప్రజల పాత్రపై క్లారిటీ ఇచ్చాడు వర్మ.

కేసీఆర్ బయోపిక్ లో ఆంధ్రా ప్రజల్ని వర్మ విలన్లుగా చూపించబోతున్నాడంటూ దుమారం చెలరేగింది. అదే కనుక జరిగితే ఏపీలో సినిమాను నిషేధిస్తామంటూ వర్మపై ఆంధ్రా ప్రజలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అయితే ఇది ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా తీస్తున్న సినిమా కాదని స్పష్టంచేశాడు వర్మ.

తన సినిమా ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా ఉండదని స్పష్టంచేసిన వర్మ.. ఆంధ్రా ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన కొంతమంది ఆంధ్రోళ్లను, రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి కారణమైన మరికొంతమంది ఆంధ్రోళ్లను మాత్రమే తన సినిమాలో విలన్లుగా చూపిస్తానని స్పష్టంచేశాడు.

ఈ సందర్భంగా కేసీఆర్ బయోపిక్ కు సంబంధించి ఓ పాటను కూడా విడుదల చేశాడు వర్మ. ఆ పాటను తనే స్వయంగా పాడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. మొత్తమ్మీద కేసీఆర్ బయోపిక్ కు సంబంధించి ఓ చిన్న స్పష్టత అయితే ఇచ్చాడు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో.

Tags:    
Advertisement

Similar News