40 ఏళ్ల అనుభవజ్ఞుడికి ఇది కూడా తెలియదా?
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలనా పరమైన వ్యహారాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే నలభై సంవత్సరాల అనుభవనం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల కోడ్ ను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల పై ఈరోజు సమీక్షలు నిర్వహించాడు చంద్రబాబు. అయితే రాజధానిపై సమీక్షకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకాలేదు. దానికి కారణం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇలాంటి సమీక్షలు నిర్వహించకూడదని, అందుకే తాను హాజరు కావడం లేదని చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ […]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలనా పరమైన వ్యహారాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే నలభై సంవత్సరాల అనుభవనం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల కోడ్ ను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల పై ఈరోజు సమీక్షలు నిర్వహించాడు చంద్రబాబు.
అయితే రాజధానిపై సమీక్షకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకాలేదు. దానికి కారణం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇలాంటి సమీక్షలు నిర్వహించకూడదని, అందుకే తాను హాజరు కావడం లేదని చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం రాజధానిపై సమీక్ష నిర్వహించాడు.
అయితే దీనిపై ఈసీ స్పందించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న చంద్రబాబు తీరుపై ఈసీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు సమీక్షలను కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తున్నామన్నారు.
రాజధాని పై, హోంశాఖ పై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని మొదట చంద్రబాబు సిద్ధమయ్యాడు. అయితే రాజధానిపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, అధికారులు ఎన్నికల కోడ్ ఉందని, ఇబ్బంది అవుతుందని చెప్పడంతో హోంశాఖపై సమీక్ష మాత్రం రద్దు చేశాడు.