12 ఏళ్ల విరామం తర్వాత దినేశ్ కార్తీక్ కు ప్రపంచకప్ బెర్త్

2007 ప్రపంచకప్ లో తొలిసారి పాల్గొన్న దినేశ్ కార్తీక్ ప్రపంచకప్ బెర్త్ తో గాల్లో తేలిపోతున్న దినేశ్ కార్తీక్ జీవితలక్ష్యం నెరవేరిందంటున్న రిజర్వ్ వికెట్ కీపర్ ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో అనూహ్యంగా తనకు చోటు దక్కడంతో…తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ గాల్లో తేలిపోతున్నాడు. తన చిరకాల స్వప్నం మరోసారి నిజమైందని…తనపై సెలెక్టర్లు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటానని ధీమాగా చెబుతున్నాడు. క్రికెటర్ల జీవితలక్ష్యం…. […]

Advertisement
Update:2019-04-17 13:44 IST
  • 2007 ప్రపంచకప్ లో తొలిసారి పాల్గొన్న దినేశ్ కార్తీక్
  • ప్రపంచకప్ బెర్త్ తో గాల్లో తేలిపోతున్న దినేశ్ కార్తీక్
  • జీవితలక్ష్యం నెరవేరిందంటున్న రిజర్వ్ వికెట్ కీపర్

ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో అనూహ్యంగా తనకు చోటు దక్కడంతో…తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ గాల్లో తేలిపోతున్నాడు.

తన చిరకాల స్వప్నం మరోసారి నిజమైందని…తనపై సెలెక్టర్లు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటానని ధీమాగా చెబుతున్నాడు.

క్రికెటర్ల జీవితలక్ష్యం….

ప్రపంచకప్ ఏదైనా…భారతజట్టులో సభ్యుడిగా పాల్గొనటం ..క్రికెటర్లకు జీవితలక్ష్యం మాత్రమే కాదు…జీవితకాల అనుభవం.

అంబటి రాయుడు, రిషభ్ పంత్ లాంటి కొందరు క్రికెటర్లకు ప్రపంచకప్ బెర్త్ అందినట్లే అంది…చివరి నిముషంలో చేజారిపోతే… తనకు ఏమాత్రం అవకాశమే లేదని భావించిన… వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ కు అనుకోకుండా ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం రావటం…ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

పాపం ! రాయుడు… లక్కీ ఫెలోస్ విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్ అన్నమాటలు సైతం వినిపిస్తున్నాయి.

అనుకోకుండా….. ఎవరేమనుకొన్నా… ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా…. ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం తనకు 12 ఏళ్ల విరామం తర్వాత మరోసారి దక్కడంతో …దినేశ్ కార్తీక్ పట్టలేని ఆనందంతో పొంగిపోతున్నాడు.

జాతీయక్రికెట్లో తమిళనాడు, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న దినేశ్ కార్తీక్ కు చురుకైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా పేరుంది.

మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను ముగించే సత్తాతో పాటు…ఒత్తిడిని ఎదుర్కొనే నేర్పు సైతం దినేశ్ కార్తీక్ కు అదనపు బలంగా మారింది.

ఈ రెండు అంశాలతోనే… తనకు గట్టిపోటీ ఇచ్చిన రిషభ్ పంత్ ను అధిగమించి మరీ…రిజర్వ్ వికెట్ కీపర్ గా భారతజట్టులో చోటు సంపాదించాడు.

91 వన్డేలు…1738 పరుగులు

33 ఏళ్ల దినేశ్ కార్తీక్ కు తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 91 వన్డేల్లో…9 హాఫ్ సెంచరీలతో సహా 1738 పరుగులు సాధించిన అనుభవం ఉంది.

రిజర్వ్ వికెట్ కీపర్ గా జట్టులో చోటు సంపాదించిన దినేశ్ కార్తీక్…బెంచ్ కే పరిమితమవుతాడా?…తుదిజట్టులో సభ్యుడిగా ఆడే చాన్స్ వస్తుందా? …అన్నదే ఇక్కడి అసలు పాయింట్.

Tags:    
Advertisement

Similar News