బన్నీ కి కూడా చరణ్ హీరోయినే కావాలట !
రామ్ చరణ్, అల్లు అర్జున్…. ఈ ఇద్దరి మెగా హీరోలకి ఎంతో కొంత కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది అనే చెప్పవచ్చు. చరణ్ కన్నా బన్నీ ముందుగా నే సినిమా పరిశ్రమ లో కి ఎంట్రీ ఇచ్చినా, మెగా స్టార్ వారసుడు కనుక చరణ్ మీద శ్రద్ద, ఆసక్తి అందరికీ ఎక్కువ ఉంటాయి. కానీ బన్నీ నిరుత్సాహ పడకుండా కష్ట పడి స్టైలిష్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే వీరిద్దరికీ చాలా విషయాల్లో పొంతన ఉంటుంది. […]
రామ్ చరణ్, అల్లు అర్జున్…. ఈ ఇద్దరి మెగా హీరోలకి ఎంతో కొంత కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది అనే చెప్పవచ్చు. చరణ్ కన్నా బన్నీ ముందుగా నే సినిమా పరిశ్రమ లో కి ఎంట్రీ ఇచ్చినా, మెగా స్టార్ వారసుడు కనుక చరణ్ మీద శ్రద్ద, ఆసక్తి అందరికీ ఎక్కువ ఉంటాయి. కానీ బన్నీ నిరుత్సాహ పడకుండా కష్ట పడి స్టైలిష్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.
అయితే వీరిద్దరికీ చాలా విషయాల్లో పొంతన ఉంటుంది. చరణ్ ఒక పెద్ద హిట్ కొట్టిన ప్రతీ సారి బన్నీ కూడా ఆ రేంజ్ హిట్ ఇవ్వాలని అనుకుంటాడట. అయితే ప్రస్తుతం బన్నీ… చరణ్ సరసన నటించిన హీరోయిన్ తో నటించాలని అనుకుంటున్నాడట. రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం లో చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుంది.
అయితే వేణు శ్రీరామ్ తో తాను చేయనున్న సినిమా లో కూడా హీరోయిన్ గా అలియా ని అప్రోచ్ అవ్వమని బన్నీ నిర్మాత దిల్ రాజు ని కోరాడట. పారితోషికం విషయమై సమస్య వచ్చినా, తనకి ఎలాగో హిందీ లో క్రేజ్ ఉంది కాబట్టి, అది సినిమా కి ప్లస్ అవుతుంది అని …. బన్నీ దర్శక నిర్మాతలని కన్విన్స్ చేస్తున్నాడట. సినిమా మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉండటం తో దర్శక నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.