ఆర్-ఆర్-ఆర్ లో ప్రభాస్?
వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అవును.. ఆర్-ఆర్-ఆర్ లో ప్రభాస్ ను కూడా భాగస్వామిగా చేశాడు దర్శకుడు రాజమౌళి. కాకపోతే ప్రభాస్ తెరపైన కనిపించడు. కేవలం ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించి వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తాడట. ఈ సినిమాలో కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారనే విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ చరిత్రలో మనం చదువుకున్న టైపులో ఈ పాత్రలు ఉండవట. అందుకే వాళ్ల పాత్రల పరిచయం […]
వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అవును.. ఆర్-ఆర్-ఆర్ లో ప్రభాస్ ను కూడా భాగస్వామిగా చేశాడు దర్శకుడు రాజమౌళి. కాకపోతే ప్రభాస్ తెరపైన కనిపించడు. కేవలం ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించి వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తాడట.
ఈ సినిమాలో కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారనే విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ చరిత్రలో మనం చదువుకున్న టైపులో ఈ పాత్రలు ఉండవట. అందుకే వాళ్ల పాత్రల పరిచయం కోసం ప్రభాస్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలని రాజమౌళి నిర్ణయించాడు. జక్కన్న అడగడమే ఆలస్యం ఒప్పుకున్నాడట ప్రభాస్.
గతంలో బాహుబలి-2 విషయంలో కూడా ఇలాంటి పుకార్లే నడిచాయి. ఆ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడంటూ, విడుదలకు ముందు రూమర్లు వినిపించాయి. ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ కు ప్రభాస్ వాయిస్ ఓవర్ అంటూ కథనాలు వస్తున్నాయి. ఇది కూడా పుకారా లేక నిజమా అనేది తేలాల్సి ఉంది.