చిటికెడు పసుపు.... ఆరోగ్యానికి.... అందానికి మెరుపు
వంటిల్లు…. కాదు… కాదు… ఔషధశాల. వంట ఇంట్లో వాడే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఏదో రకంగా మేలు చేస్తుంది. పసుపు అయితే సర్వరోగాలను నివారిస్తుంది. చిటికెడు పసుపు అటు ఆరోగ్యం… ఇటు అందం కూడా. అలాంటి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. పసుపులో సహజ సిద్ద గుణాలతో పాటు యాంటీబైటిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి అందానికే కాదు ఆరోగ్యానికి కూడా అద్బుతంగా పనిచేస్తాయి. పసుపు ఆహారంలో ఉన్న చెడు కొలేస్ట్రాల్ తో పాటు ఇతర […]
Advertisement
వంటిల్లు…. కాదు… కాదు… ఔషధశాల. వంట ఇంట్లో వాడే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఏదో రకంగా మేలు చేస్తుంది. పసుపు అయితే సర్వరోగాలను నివారిస్తుంది. చిటికెడు పసుపు అటు ఆరోగ్యం… ఇటు అందం కూడా. అలాంటి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
- పసుపులో సహజ సిద్ద గుణాలతో పాటు యాంటీబైటిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి అందానికే కాదు ఆరోగ్యానికి కూడా అద్బుతంగా పనిచేస్తాయి.
- పసుపు ఆహారంలో ఉన్న చెడు కొలేస్ట్రాల్ తో పాటు ఇతర హానికర పదార్దాలను తొలగిస్తుంది.
- పసుపు అనేక రోగలకు చెక్ పెడుతుంది. ఒక ఔన్స్ పసుపులో మానవ శరీరానికి కావాల్సిన ఐరన్, బి6, మెగ్నీషియం, విటమిన్ సి, పోటాషియం, ఫైబర్ అందుతాయి.
- పసుపు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు పసుపు, తేనే కలుపుకుని తాగితే శరీరం శుద్ది కావడమే కాదు… ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
- శరీరంలో ఉన్న మెటబాలిజం శాతాన్ని పెంచేందుకు పసుపు ఎంతో దోహదపడుతుంది. దీంతో అధిక బరువు పెరగకుండా ఉపయోగపడుతుంది.
- పసుపు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శ్లేషం, కడుపులోని క్రిములు, దగ్గు, వాతం, జ్వరం, నీళ్ల విరోచనాలు వంటి సమస్యలను నివారిస్తుంది.
- పసుపు కొమ్ములను కొద్దిగా కాల్చి, వాటిని బాగా నమిలితే పుచ్చి పళ్లు పోవడంతో పాటు ఇతర దంత సమస్యలు తగ్గుతాయి.
- సెగెడ్డలు, ఇతర కురుపులకు సరైన వైద్యం పసుపు. ఒక బట్టలో పసుపును కట్టి దానిని కురుపులపై కడితే అవి వెంటనే మాడిపోతాయి.
- క్యాన్సర్, షుగర్, అల్జీమర్స్, అర్ధరైటిస్ వంటి వ్యాధులను పసుపు నిరోధిస్తుంది.
- తేలు, జర్రి లేదా ఇతర క్రిములు కుట్టిన చోట పసుపు లేదా పసుపు కొమ్ము కాల్చి దాని పొగను వేస్తే ఆ విషం వెంటనే హరించుకుపోతుంది.
- హిస్టీరియాతో బాధపడుతున్నవారికి పసుపు కొమ్ము కాల్చి దాని పొగను పట్టిస్తే ఆ బాధ నుండి ఉపశమనం కలుగుతుంది.
- పసుపు, కొద్దిగా పటికా కలిపి మెత్తగా పొడి చేసి ఆ మిశ్రమాన్ని ఒక చిటికెడు చెవి లోపల వేస్తే చెవికి సంబంధించిన అన్ని వ్యాధులు నయం అవుతాయి.
- పసుపు కొమ్ము పొగ పీల్చినా లేదా పసుపు నీళ్లు ఆవిరి పట్టినా వికారం, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
- పసుపు బట్టతో కళ్లు తుడుచుకుంటే కండ్లకలక తగ్గతుంది. చర్మంపై గజ్జి, తామరతో పాటు ఇతర చర్మవ్యాధులకు పసుపు నీటితో వొంటిని తుడుచుకుంటే అవి వెంటనే మాడిపోతాయి.
- మీగడలో కొద్దిగా పసుపు కలుపుకుని కళ్ల చుట్టూ రాసుకుంటే కళ్ల క్రింద ఉన్న నల్లటి వలయాలు మాయమవుతాయి.
- పసుపును పాలతో కలిపి తీసుకుంటే వాటిలో ఉండే యాంటీ మైక్రోబైల్ గుణాలు, బ్యాక్టీరియల్ ఇంకా వైరల్ ఇన్షెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తాయి.
- పసుపు కొమ్మును పాలతో మరిగించి… ఆ పాలను తాగితే సైనస్ తో బాధపడుతున్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది.
- పసుపు, పాలలో యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు చాలా ఉండడం వల్ల ఇవి బ్రెస్ట్ క్యాన్స్ ర్, స్కిన్ క్యాన్స్ ర్ లను అదపుచేస్తుంది.
- పసుపు పాలు కీళ్ళనొప్పులు నయం చేయడానికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను తొలగిస్తుంది.
- లివర్, రక్తనాళాలను శుద్ది చేయడానికి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది.
Advertisement