నిర్భయంగా ఓటేయండి... మార్పు కోసం ఓటేయండి " జగన్
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామం కడప జిల్లాలోని పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వై.ఎస్.భారతి, తల్లి వై.ఎస్. విజయమ్మ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరుల్లా క్యూలైన్ లో నిలుచున్న జగన్ మోహన్ రెడ్ది, భారతి, విజయమ్మ అందరికి నమస్కరిస్తూ తమ వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడం […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామం కడప జిల్లాలోని పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వై.ఎస్.భారతి, తల్లి వై.ఎస్. విజయమ్మ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సాధారణ పౌరుల్లా క్యూలైన్ లో నిలుచున్న జగన్ మోహన్ రెడ్ది, భారతి, విజయమ్మ అందరికి నమస్కరిస్తూ తమ వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.
“అందరూ ఓటును నిర్భయంగా వేయండి. మార్పు కోసం వేయండి” అని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కూడా మీడియాతో మాట్లాడారు. ” ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మీ ఓటును తెలివితో వేయండి” అని విజయమ్మ కోరారు.
గతంలో రాష్ట్రంలో స్వర్ణయుగం ఉందని, అలాంటి రోజులు మళ్లీ రావాలని కోరుకునే వారంతా మంచికి ఓటు వేయాలని విజయమ్మ సూచించారు.
ఇక వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సతీమణి వై.ఎస్.భారతి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓటర్లందరూ మంచి ప్రభుత్వం కోసం, మార్పు కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
“యువ ఓటర్లకు ఇది ఆయుధం వంటిది. తమ ఓటును తెలివితో ఉపయోగించాలి. తమ భవిష్యత్ మంచిగా ఉండేందుకు యువ, కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి” అని వై.ఎస్.భారతి అన్నారు.
పులివెందులలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో నిలుచోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.