ఏపీలో మాదే విజయం.. మీడియాతో వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన ఓటును పులివెందులలో ఉపయోగించుకున్నారు. జగన్‌తో పాటు భార్య భారతీ, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్ కూడా ఓటేశారు. పోలింగ్ బూత్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం వైఎస్ జగన్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రావడంపై తాను పూర్తి ధీమాగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు […]

Advertisement
Update:2019-04-11 08:54 IST

ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన ఓటును పులివెందులలో ఉపయోగించుకున్నారు. జగన్‌తో పాటు భార్య భారతీ, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్ కూడా ఓటేశారు. పోలింగ్ బూత్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం వైఎస్ జగన్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రావడంపై తాను పూర్తి ధీమాగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారని.. గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అందుకే నూతన నాయకత్వం పైపు ప్రజలు చూస్తున్నారని జగన్ అన్నారు.

ఆ దేవుని ఆశీస్సులతో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మార్పు కోసం ఓటేయండి, ధైర్యంగా ఓటేయండని జగన్ కొత్తగా తొలిసారి ఓటేయబోతున్న యువతకు సందేశాన్ని ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్దగా మాట్లాడనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags:    
Advertisement

Similar News