చిత్రలహరి ప్రీ-రిలీజ్ బిజినెస్

వరుసగా 6 ఫ్లాపులు వచ్చిన హీరో సాయితేజ్. ఇలాంటి హీరో నుంచి ఇంకో సినిమా వస్తుందంటే బయ్యర్లు పెద్దగా పట్టించుకోని పరిస్థితి. అందుకే చిత్రలహరి బిజినెస్ పై చాలా అనుమానాలు వచ్చాయి ఆమధ్య. అయితే చాకచక్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ పెట్టి, వాళ్లు చెప్పిన రేట్లకే సినిమాను అమ్మేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మగలిగారు. ఏపీ, నైజాంలో అటు ఇటుగా 10 కోట్ల రూపాయలకు […]

Advertisement
Update:2019-04-10 15:28 IST

వరుసగా 6 ఫ్లాపులు వచ్చిన హీరో సాయితేజ్. ఇలాంటి హీరో నుంచి ఇంకో సినిమా వస్తుందంటే బయ్యర్లు పెద్దగా పట్టించుకోని పరిస్థితి. అందుకే చిత్రలహరి బిజినెస్ పై చాలా అనుమానాలు వచ్చాయి ఆమధ్య.

అయితే చాకచక్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ పెట్టి, వాళ్లు చెప్పిన రేట్లకే సినిమాను అమ్మేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మగలిగారు. ఏపీ, నైజాంలో అటు ఇటుగా 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయి.

వివిధ ప్రాంతాల్లో చిత్రలహరి థియేట్రికల్ బిజినెస్ ఇలా ఉంది.

నైజాం – రూ. 3 కోట్లు
సీడెడ్ – రూ. 1.80 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ. 1.32 కోట్లు
ఈస్ట్ – రూ. 0.96 కోట్లు
వెస్ట్ – రూ. 0.84 కోట్లు
గుంటూరు – రూ. 1.10 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు
కృష్ణా – రూ. 0.90 కోట్లు

Tags:    
Advertisement

Similar News