అలా జరగకూడదనే.... ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట!

ఈ మధ్యనే ‘టాక్సీవాలా’ సినిమాతో మరో హిట్ ను అందుకున్న హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. అయితే ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ఫస్ట్ సింగల్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. హైప్ పెంచడం కోసం ప్లాన్ చేసేది మరెవరో కాదు విజయ్ దేవరకొండ […]

Advertisement
Update:2019-04-09 08:38 IST

ఈ మధ్యనే ‘టాక్సీవాలా’ సినిమాతో మరో హిట్ ను అందుకున్న హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న విడుదల కానుంది.

అయితే ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ఫస్ట్ సింగల్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. హైప్ పెంచడం కోసం ప్లాన్ చేసేది మరెవరో కాదు విజయ్ దేవరకొండ అని కొందరు అంటున్నారు.

టీజర్ ఎలా కట్ చేయాలి, ఏ ఆడియో సింగిల్ ఎప్పుడు విడుదల చేయాలి…. మొదలగు విషయాలలో విజయ్ దేవరకొండ స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నాడట. అంతేకాక ఇలా చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయని చెబుతున్నారు.

కానీ ‘నోటా’ తమిళ సినిమా కాబట్టి ప్రొడక్షన్ పనులన్నీ వారే చూసుకున్నారని, కంటెంట్ వీక్ గా ఉన్నప్పటికీ, యావరేజ్ గా మారాల్సిన ఈ సినిమా వారివల్లే డిజాస్టర్ గా మారిందని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ‘డియర్ కామ్రేడ్’ విషయంలో అలా జరగకూడదనే…. ఇలా అన్ని పనులను జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటున్నాడట విజయ్ దేవరకొండ. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మొత్తానికి కేవలం నటనకు మాత్రమే పరిమితమవ్వకుండా విజయ్ దేవరకొండ ఇలా అన్ని పనులను చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నాడట.

Tags:    
Advertisement

Similar News