చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నారా లోకేష్ గెలవడు
చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్‌ను మంగళగిరిలో ఎలాగైనా గెలిపించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ లోకేష్ గెలవడని మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. లోకేష్‌కు కనీసం ఎన్నికల తేదీ కూడా తెలియదని.. 9వ తేదీన జరిగే ఎన్నికల్లో లోకేష్ గెలవడు కానీ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో మాత్రం వైసీపీ తప్పక విజయం సాధిస్తుందని ఆర్కే చలోక్తులు విసిరారు. ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుండటంతో ఆర్కే […]
చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్‌ను మంగళగిరిలో ఎలాగైనా గెలిపించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ లోకేష్ గెలవడని మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
లోకేష్‌కు కనీసం ఎన్నికల తేదీ కూడా తెలియదని.. 9వ తేదీన జరిగే ఎన్నికల్లో లోకేష్ గెలవడు కానీ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో మాత్రం వైసీపీ తప్పక విజయం సాధిస్తుందని ఆర్కే చలోక్తులు విసిరారు.
ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుండటంతో ఆర్కే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మంగళగిరి అని పలకడం రాని వ్యక్తి, ఎన్నికల తేదీ, కౌంటింగ్ తేదీ తెలియని వ్యక్తిని ఇక్కడ ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని ఆయన చెప్పారు.
నా ఓటమి కోసం చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తున్నారు.. అయినా ఇక్కడ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆర్కే చెప్పారు. మరోవైపు ఆర్కే కోసం జగన్ కూడా ఇవాళ మంగళగిరిలో ప్రచారం చేశారు. ఆర్కేను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆర్కేని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.