మహర్షిపై ఓవర్సీస్ లో నమ్మకం లేదా?

మహేష్ బాబు సినిమా అంటే మార్కెట్లో హాట్ కేక్. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా షూటింగ్ మొదలవుతుంది. అలాంటిది మహర్షి విషయానికొచ్చేసరికి మాత్రం లెక్కలు తప్పాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో మహర్షి ఇప్పటివరకు అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యం. మహర్షి సినిమాకు సంబంధించి ఓవర్సీస్ రేట్ చాలా భారీగా చెప్పారు. ఈ రేటుకు ఓవర్సీస్ బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీనికి ఓ కారణం కూడా ఉంది. మహేష్ గత సినిమాలన్నీ ఓవర్సీస్ లో భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఫ్లాప్ […]

Advertisement
Update:2019-04-08 12:14 IST

మహేష్ బాబు సినిమా అంటే మార్కెట్లో హాట్ కేక్. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా షూటింగ్ మొదలవుతుంది. అలాంటిది మహర్షి విషయానికొచ్చేసరికి మాత్రం లెక్కలు తప్పాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో మహర్షి ఇప్పటివరకు అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యం.

మహర్షి సినిమాకు సంబంధించి ఓవర్సీస్ రేట్ చాలా భారీగా చెప్పారు. ఈ రేటుకు ఓవర్సీస్ బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీనికి ఓ కారణం కూడా ఉంది. మహేష్ గత సినిమాలన్నీ ఓవర్సీస్ లో భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఫ్లాప్ అయిన సినిమాకు నష్టాలు తప్పలేదు. మరోవైపు మూవీ హిట్ అయినా బయ్యర్లకు ఏం మిగలట్లేదు. అందుకే మహర్షిని కొనేందుకు అంతా వెనకాడుతున్నారు. దీంతో మేకర్స్ కాస్త డిస్కౌంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను గ్రేట్ ఇండియన్ ఫిలిమ్స్ కు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ఆ సంస్థ గంపగుత్తగా ఓవర్సీస్ రైట్స్ తీసుకోవడం లేదు. షేరింగ్ పద్ధతిన సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతోంది. అటుఇటుగా 10 కోట్ల రూపాయలకు మహర్షి సినిమా ఓవర్సీస్ లాక్ అయ్యే అవకాశాలున్నాయి.

భరత్ అనే నేను సినిమాను భారీ రేట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హిట్ అయింది. కానీ భారీ రేట్లు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది బయ్యర్లు నష్టపోయారు. అటు ఓవర్సీస్ బయ్యర్లకు కూడా ఏమీ మిగల్లేదు. అందుకే మహర్షి సినిమాను భరత్ అనే నేను రేట్లకు దగ్గరగానే అమ్ముతున్నారు. అయినప్పటికీ బయ్యర్లు ముందుకురావడం లేదని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News