టీడీపీ చానల్‌లో.... విజయసాయి రెడ్డి పేరుతో ఫేక్ ఆడియో

ఏపీలో టీడీపీ గెలుస్తోందని లోక్‌నీతి సర్వే చెప్పిందని ఆ మధ్య ఒక ఫేక్ సర్వేను ప్రచురించిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు మరోభారీ ప్రయత్నం చేసింది. విజయసాయిరెడ్డి పేరుతో ఒక ఆడియో టేపు విడుదల చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ గొంతు ఆయనది కాదు. ఆస్ట్రేలియాలో ఉంటున్న రమణ అనే వ్యక్తికి సంబంధించిన ఆడియో టేపు. ఆ వాయిస్‌ విజయసాయిరెడ్డిది కాదు అన్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతోంది. రమణ అనే వ్యక్తి వైసీపీ గెలుపుపై ధీమాతో నిర్లక్ష్యంగా ఉంటోంది…. […]

Advertisement
Update:2019-04-06 12:15 IST

ఏపీలో టీడీపీ గెలుస్తోందని లోక్‌నీతి సర్వే చెప్పిందని ఆ మధ్య ఒక ఫేక్ సర్వేను ప్రచురించిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు మరోభారీ ప్రయత్నం చేసింది.

విజయసాయిరెడ్డి పేరుతో ఒక ఆడియో టేపు విడుదల చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ గొంతు ఆయనది కాదు. ఆస్ట్రేలియాలో ఉంటున్న రమణ అనే వ్యక్తికి సంబంధించిన ఆడియో టేపు. ఆ వాయిస్‌ విజయసాయిరెడ్డిది కాదు అన్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతోంది.

రమణ అనే వ్యక్తి వైసీపీ గెలుపుపై ధీమాతో నిర్లక్ష్యంగా ఉంటోంది…. అలా ఉండడం సరికాదంటూ ఈ ఆడియోను తన అభిప్రాయంగా విడుదల చేశారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకున్నాడు… ధుర్యోధనుడు లాంటి వాడు
కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు.

మోడీ నిజాయితీపరుడైతే చంద్రబాబు డబ్బు ప్రవాహాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు గెలుపు కోసం ఏమైనా చేస్తారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

అయితే టీడీపీ చానల్ మాత్రం ఆ ఆడియో టేపును విజయసాయిరెడ్డి పేరుతో ప్రసారం చేయడం బట్టి చూస్తుంటే ఎన్నికల్లో గెలుపు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడినట్టుగా ఉంది.

Tags:    
Advertisement

Similar News