వెంకీమామలో మిలట్రీ బ్యాక్ డ్రాప్

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీ మామ టైటిల్ లోగో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వెంకీ మామ అనే టైటిల్ ను ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఈరోజు జస్ట్ లోగో మాత్రం రిలీజ్ చేశారు. కాబట్టి పెద్దగా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కాకపోతే ఉన్నంతలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో మిలట్రీ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. వెంకీ మామ సినిమా పూర్తిగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని అనుకున్నారంతా. […]

Advertisement
Update:2019-04-06 06:21 IST
వెంకీమామలో మిలట్రీ బ్యాక్ డ్రాప్
  • whatsapp icon

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీ మామ టైటిల్ లోగో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వెంకీ మామ అనే టైటిల్ ను ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఈరోజు జస్ట్ లోగో మాత్రం రిలీజ్ చేశారు. కాబట్టి పెద్దగా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కాకపోతే ఉన్నంతలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో మిలట్రీ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది.

వెంకీ మామ సినిమా పూర్తిగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని అనుకున్నారంతా. అందుకు తగ్గట్టే ఫస్ట్ షెడ్యూల్ ను పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో తీశారు. కానీ ఇందులో పల్లె వాతావరణంతో పాటు యుద్ధ వాతావరణం కూడా ఉంది.

అవును.. ఇందులో నాగచైతన్య మిలట్రీ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. సినిమా సెకెండాఫ్ లో వచ్చే ఆ సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని తెలుస్తోంది. టైటిల్ లో కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు లోగోకు ఓవైపు పల్లెటూరు మరోవైపు యుద్ధాన్ని తలపించే థీమ్ పెట్టారు.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్, చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News