ఆ దర్శకుడు 'జె.డి.' ఈగోని హర్ట్ చేశాడట.... కానీ....

తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న జె.డి.చక్రవర్తి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కంటే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. తాజాగా జె.డి.చక్రవర్తి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘హిప్పీ’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఈ చిత్రం గురించి జె.డి.చక్రవర్తి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కలైపులి ఎస్ కంటే మంచి నిర్మాత ఎవరూ […]

Advertisement
Update:2019-04-05 02:35 IST

తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న జె.డి.చక్రవర్తి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కంటే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు.

తాజాగా జె.డి.చక్రవర్తి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘హిప్పీ’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది.

ఈ చిత్రం గురించి జె.డి.చక్రవర్తి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కలైపులి ఎస్ కంటే మంచి నిర్మాత ఎవరూ ఉండరు అని అన్నారు జేడీ. “నేను ‘అరిమనంబి’ సినిమా షూటింగ్ లో గాయపడ్డప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఆపరేషన్ అవసరం లేకుండానే నా చెయ్యి బాగవ్వడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన ఫ్రెండ్లీ నేచర్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని అన్నారు జె.డి.చక్రవర్తి.

“దర్శకుడు టి ఎన్ కృష్ణ నా పాత్రను ఫైనలైజ్ చేసిన తరువాత కూడా స్క్రీన్ టెస్ట్ కి రమ్మని నా ఈగో ని హర్ట్ చేశాడు. కానీ నేను ఈగో ని పక్కనపెట్టి వెళ్లాను. అలా చేయడం నాకు మంచే జరిగింది. ఎందుకంటే నేను ఆ రోజు కనుక వెళ్లకపోయి ఉండుంటే నాకే నష్టం జరిగి ఉండేది…. కార్తికేయ చాలా టాలెంట్ ఉన్న హీరో అని ఎప్పటికైనా చాలా పెద్ద హీరో అవుతాడని” జె.డి.చక్రవర్తి చెప్పుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News