అభ్యర్థులెవరో మరిచిపోయిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాలు సీనియస్‌గానే తీసుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. చివరకు ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నఅభ్యర్థుల పేర్లు కూడా పవన్ కల్యాణ్ చెప్పలేకపోయారు. తిరుపతి సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్… చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేయడానికి ఆపసోపాలు పడ్డారు. చివరకు పార్టీ నేతలు వచ్చి అభ్యర్థుల పేర్లు చెబుతుంటే వాటిని వల్లెవేస్తూ వారికి ఓట్లేయాల్సిందిగా పవన్ కోరారు. తిరుపతి నుంచి పోటీచేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి పేరు మినహా మిగిలిన అందరి పేర్లను పక్కవారిని అడిగి […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాలు సీనియస్‌గానే తీసుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. చివరకు ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నఅభ్యర్థుల పేర్లు కూడా పవన్ కల్యాణ్ చెప్పలేకపోయారు. తిరుపతి సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్… చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేయడానికి ఆపసోపాలు పడ్డారు.
చివరకు పార్టీ నేతలు వచ్చి అభ్యర్థుల పేర్లు చెబుతుంటే వాటిని వల్లెవేస్తూ వారికి ఓట్లేయాల్సిందిగా పవన్ కోరారు. తిరుపతి నుంచి పోటీచేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి పేరు మినహా మిగిలిన అందరి పేర్లను పక్కవారిని అడిగి తెలుసుకుని చెప్పారు.
గంగాధర నెల్లూరు నుంచి తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయారు. దీంతో
ఆయన్ను పరిచయం చేయలేకపోయారు. దీంతో జీడీ నెల్లూరులో పోటీలో ఉన్న అభ్యర్థి పవన్ వద్దకు వచ్చి పేరు చెప్పడంతో గెలిపించాలని కోరారు.
రాజంపేట నుంచి పోటీ చేస్తున్న స్వాతిని… మదనపల్లి అభ్యర్థిగా పవన్ పరిచయం చేశారు. ఆ తర్వాత నాయకులు సర్ధిచెప్పడంతో తప్పు దిద్దుకున్నారు.
ఇలా తాను టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల పేర్లే పవన్ కల్యాణ్‌కు గుర్తు లేకపోవడంతో సభకు వచ్చిన వారు కంగుతిన్నారు. కనీస కసరత్తు కూడా చేయకుండానే, వారి పేర్లను గుర్తుంచుకునేంత పరిచయం కూడా లేని వారికి పవన్ టికెట్లు ఇచ్చేశారా? అని ఆశ్చర్యపోయారు.