ఇస్మార్ట్ శంకర్ గ్యాప్ ఇవ్వట్లేదుగా!

మొన్ననే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేశారు. జస్ట్ 2 రోజులు మాత్రమే రెస్ట్ తీసుకున్నారు. వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. అవును.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరో రామ్ పై ఓ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. `దిమాక్ ఖ‌రాబ్‌..` అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. […]

Advertisement
Update:2019-04-03 12:30 IST

మొన్ననే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేశారు. జస్ట్ 2 రోజులు మాత్రమే రెస్ట్ తీసుకున్నారు. వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. అవును.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరో రామ్ పై ఓ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.

'దిమాక్ ఖ‌రాబ్‌..' అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన‌ర్స్‌గా పేరున్న హీరో రామ్ మ‌రోసారి అదిరిపోయే స్టెప్పుల‌తో మెప్పించ‌నున్నాడు. కాస‌ర్ల‌శ్యామ్ రాసిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ‌, సాకేత్ పాడారు. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం అందిస్తున్నారు.

సినిమాల్ని చకచకా పూర్తిచేయడం పూరి జగన్నాధ్ స్టయిల్. ఇస్మార్ట్ శంకర్ సినిమాను కూడా అదే రేంజ్ లో పూర్తిచేస్తున్నాడు. ఎలాగైనా ఈ సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. పూరి, చార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు.

Tags:    
Advertisement

Similar News