21 కోట్లు బిజినెస్ చేసిన మజిలీ

నాగచైతన్యకు కాస్త క్రేజ్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఇదే హీరో సమంతతో కలిస్తే కచ్చితంగా క్రేజ్. అందుకే మజిలీ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ 21 కోట్ల రూపాయల  బిజినెస్ చేసింది. రియల్ లైఫ్ భార్యాభర్తలైన సమంత-నాగచైతన్య..మజిలీ సినిమాకు  మెయిన్ ఎట్రాక్షన్. ఆ తర్వాతే కథైనా, డైరక్టర్ అయినా, మ్యూజిక్ అయినా. ఈనెల 5న గ్రాండ్ గా ఈ సినిమా విడుదలకాబోతోంది. ఆ వెంటనే ఉగాది ఉంది. అంటే సెలవు అన్నమాట. మజిలీకి మార్కెట్ పెరగడానికి ఇది కూడా ఓ […]

Advertisement
Update:2019-04-02 15:56 IST

నాగచైతన్యకు కాస్త క్రేజ్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఇదే హీరో సమంతతో కలిస్తే కచ్చితంగా క్రేజ్. అందుకే మజిలీ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ 21 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. రియల్ లైఫ్ భార్యాభర్తలైన సమంత-నాగచైతన్య..మజిలీ సినిమాకు
మెయిన్ ఎట్రాక్షన్. ఆ తర్వాతే కథైనా, డైరక్టర్ అయినా, మ్యూజిక్ అయినా.

ఈనెల 5న గ్రాండ్ గా ఈ సినిమా విడుదలకాబోతోంది. ఆ వెంటనే ఉగాది ఉంది. అంటే సెలవు అన్నమాట. మజిలీకి మార్కెట్ పెరగడానికి ఇది కూడా ఓ కారణం. సో.. ఈ రెండు రోజులతో పాటు వీకెండ్ కూడా కలిసొస్తే, 4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్
అవుతుందని ట్రేడ్ భావిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ చూద్దాం.

నైజాం – రూ. 6 కోట్లు
సీడెడ్ – రూ. 2.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.98 కోట్లు
ఈస్ట్ – రూ. 1.44 కోట్లు
వెస్ట్ – రూ. రూ. 1.12 కోట్లు
గుంటూరు – రూ. 1.62 కోట్లు
నెల్లూరు – రూ. 0.70 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు

Tags:    
Advertisement

Similar News