రాగులతో... పోతాయిలే రోగాలు...

రాగులు… కొన్ని ప్రాంతాలలో చోళ్లు అని కూడా అంటారు.  చిరుధాన్యాలన్నింటిలోనూ  రాగులుకి ” ది బెస్ట్” అని పేరు. వీటిని ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలన్నిస్తాయి.  అంటే రాగి జావా, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టి ఇలా  ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి పిండిని జావలా చేసుకుని.. పాలతోనైనా, మజ్జిగాతోనైనా తీసుకోవచ్చు.  చిన్నపిల్లలకు పాలతో ఇస్తే ఎంతో బలం. డ్రైఫ్రూట్స్ లో ఉన్న అనేక గుణాలు […]

Advertisement
Update:2019-04-02 02:55 IST

రాగులు… కొన్ని ప్రాంతాలలో చోళ్లు అని కూడా అంటారు. చిరుధాన్యాలన్నింటిలోనూ రాగులుకి ” ది బెస్ట్” అని పేరు. వీటిని ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలన్నిస్తాయి. అంటే రాగి జావా, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టి ఇలా ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

  • రాగి పిండిని జావలా చేసుకుని.. పాలతోనైనా, మజ్జిగాతోనైనా తీసుకోవచ్చు.
  • చిన్నపిల్లలకు పాలతో ఇస్తే ఎంతో బలం.
  • డ్రైఫ్రూట్స్ లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
  • రాగులలో కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు చాల ఉన్నాయి. అందువల్ల ఇవి ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తాయి.
  • ఎసిడిటీ….. ఉన్నవారికి రాగి జావ అధ్బుత ఔషధం.
  • వేసవిలో ఉదయాన్నే రాగి జావ తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
  • రాగులలో కాల్షియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల మల బద్దకం, అజీర్ణ సమస్యలు దరి చేరవు.
  • గ్లూటిన్ సమస్యతో బాధపడుతున్నవారికి రాగులు చాలా మంచి ఆహారం.
  • బాలింతలు రాగితో చేసిన లడ్డూలు తింటే పాలు పడతాయి.
  • రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి రాగులు ఎంతో తొడ్పడతాయి.
  • ఈమధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అంటూ ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. అలాంటి వారు రోజూ రాగుల్ని ఏదో రూపంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి.
  • ఇంకా డయాబెటీస్, బీపీ, అలసట, ఊబకాయం, అతి ఆకలి వంటి దీర్ఘ వ్యాధులను కూడా ఈ రాగులు నివారిస్తాయి.
  • ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు కూడా రాగులతో వాటికి చెక్ పెట్టవచ్చు.
  • అయితే వర్షా కాలంలో, శీతకాలంలో మాత్రం మోతాదుకు మించి వీటిని తీసుకుంటే అతి శీతలం చేసి.. జలుబు, అజీర్ణం సమస్యలు రావచ్చు. అందుకని ఈ రెండు కాలాల్లోనూ రాగులకు కాసింత దూరం పాటిస్తే మంచిది.
Tags:    
Advertisement

Similar News