చంద్రబాబు పాచిక పారటం లేదా ?
నారా చంద్రబాబు నాయుడు. రాజకీయ వ్యూహ చతురుడు. పోల్ మేనేజ్ మెంట్లో పేరున్నవాడు. రాజకీయాలలో తిమ్మిని బమ్మిని… బమ్మిని తిమ్మిని చేయగల దిట్ట. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఆయన వేస్తున్న పాచికలు ఏమీ పారడం లేదని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. గడచిన రెండు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడుని దగ్గర నుంచి చూసిన వారందరూ రాజకీయంగా చంద్రబాబు వ్యూహాలకు పదును తగ్గిందని అంటున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఆడింది ఆటగా… పాడింది పాటగా […]
నారా చంద్రబాబు నాయుడు. రాజకీయ వ్యూహ చతురుడు. పోల్ మేనేజ్ మెంట్లో పేరున్నవాడు. రాజకీయాలలో తిమ్మిని బమ్మిని… బమ్మిని తిమ్మిని చేయగల దిట్ట. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఆయన వేస్తున్న పాచికలు ఏమీ పారడం లేదని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు.
గడచిన రెండు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడుని దగ్గర నుంచి చూసిన వారందరూ రాజకీయంగా చంద్రబాబు వ్యూహాలకు పదును తగ్గిందని అంటున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఆడింది ఆటగా… పాడింది పాటగా అటు అధికారులు గానీ ఇటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాని ఆచరించే వారని, ఇప్పుడు మాత్రం వారంతా చంద్రబాబుకి ఎదురు తిరిగే పరిస్థితులు ఎదురయ్యాయని అంటున్నారు.
దీనికి తాజా ఉదాహరణగా పోలీస్ అధికారుల బదిలీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చేసిన ఒత్తిడి పని చేయకపోవడం వంటివి చంద్రబాబు తప్పిదాలుగా చెబుతున్నారు. పార్టీ పరంగా చూసుకుంటే సీనియర్ నాయకులు ఎవరూ చంద్రబాబు నాయుడ్ని విశ్వసించే పరిస్థితులు కనిపించడం లేదు. తమకు నచ్చిన విధంగా తాము చేస్తామంటున్నారని, ప్రతి రోజు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ ల్లో ” జీ హుజూర్” అంటున్నారు తప్ప… చంద్రబాబు ఆదేశాలను మాత్రం ఖాతరు చేయడం లేదని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు గతంలో అవలంభించిన వైఖరేనని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. కొత్తగా పుత్ర వాత్సల్యంతో ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాలు పార్టీ సీనియర్లను ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు.
టికెట్ల పంపిణీతో సహా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి కీలక అంశాలపై పార్టీ సీనియర్లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపోటములపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక తర్వాత చంద్రబాబుపై నమ్మకం పూర్తి స్థాయిలో సన్నగిల్లిందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడు మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటారని, ఒకవేళ అలా జరగకపోతే ఆయన తనయుడు నారా లోకేష్ దే పార్టీలో పెత్తనం అవుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వేస్తున్న ఎత్తులూ… పై ఎత్తులు పని చేయటం లేదని, పార్టీలో సీనియర్ నాయకులు గానీ, సీనియర్ అధికారులు గాని ఆయన మాట వినే పరిస్థితి లేదని చెబుతున్నారు.