చంద్రబాబుకు సమాధానం లేని ప్రశ్న
అస్థిత్వం కోసం చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు వైసీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య. ఏపీతో పోలిస్తే తెలంగాణలోనూ టీడీపీ కేడర్ బలంగా ఉండేదని… అలాంటి చోట ఇప్పుడు పోటీ చేయలేని పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను శత్రువుగా ప్రకటించుకున్న చంద్రబాబు… మరి కేసీఆర్‌ను ఓడించేందుకు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో సెక్యూరిటీ సిబ్బంది తప్ప మరెవరూ లేని దుస్థితికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. పక్కన ఉన్న తెలంగాణతో గొడవ […]
అస్థిత్వం కోసం చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు వైసీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య. ఏపీతో పోలిస్తే తెలంగాణలోనూ టీడీపీ కేడర్ బలంగా ఉండేదని… అలాంటి చోట ఇప్పుడు పోటీ చేయలేని పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను శత్రువుగా ప్రకటించుకున్న చంద్రబాబు… మరి కేసీఆర్‌ను ఓడించేందుకు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో సెక్యూరిటీ సిబ్బంది తప్ప మరెవరూ లేని దుస్థితికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు.
పక్కన ఉన్న తెలంగాణతో గొడవ పెట్టుకుంటూ, ఢిల్లీలోనూ వివాదాలకు దిగుతూ రాష్ట్రానికి చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఓడిపోతేనే… ఏపీకి ఇతర రాష్ట్రాలతో, కేంద్రంలో సంబంధాలు మెరుగుపడుతాయన్నారు. బీజేపీతో నాలుగున్నరేళ్ళ పాటు సంసారం చేసిన చంద్రబాబు…. కేవలం అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్రం అంగీకరించకపోవడం వల్లే తెగదెంపులు చేసుకున్నారన్నారు.
పవన్ కల్యాణ్ అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. పవన్ రాజకీయం చూసి ఇతర ప్రాంతాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. పవన్ కల్యాణ్‌ను నమ్మి ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చిన వారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు.
గుంటూరు సభలో చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిపై ఘాటుగా మాట్లాడిన పవన్ కల్యాణ్… ఎన్నికల వేళ మాత్రం ఆ విషయం గురించి మాట్లాడడం లేదన్నారు. ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నడవవన్న విషయం పవన్ కల్యాణ్ గుర్తించుకోవాలని సలహా ఇచ్చారు.
పవన్ కల్యాణ్ స్థాయి దిగజారి బిస్కెట్లు, పౌరుషం, ప్యాకేజీ అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు ప్యాకేజీ అన్న పదం ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిందే పవన్ కల్యాణ్ ద్వారా అని…. ఆ విషయం నిక్కర్లు వేసుకున్న పిల్లలను అడిగినా చెబుతారన్నారు. పౌరుషం అంటే పిచ్చివాడిలా ఊగిపోవడమా… ప్యాకేజీలకు అమ్ముడుపోవడమా అని ప్రశ్నించారు.