డబ్బులొస్తున్నాయి... కానీ హిట్ కాదు

మినిమం బడ్జెట్ లో తీస్తే ఇదే అడ్వాంటేజ్. ఎలాగోలా ఒడ్డున పడొచ్చు. సూర్యకాంతం విషయంలో ఇదే జరిగింది. తక్కువ బడ్జెట్ లో తీయడం వల్ల ఈ సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంది. థియేట్రికల్ రన్ కు తోడు యాడ్-ఆన్ బిజినెస్ కూడా బాగా జరగడంతో సూర్యకాంతం లాభాల బాట పట్టింది. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఇది సూర్యకాంతంకు అడ్వాంటేజ్ గా మారింది. విడుదలైన ఈ రెండు రోజుల్లో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల […]

Advertisement
Update:2019-04-01 00:32 IST

మినిమం బడ్జెట్ లో తీస్తే ఇదే అడ్వాంటేజ్. ఎలాగోలా ఒడ్డున పడొచ్చు. సూర్యకాంతం విషయంలో ఇదే జరిగింది. తక్కువ బడ్జెట్ లో తీయడం వల్ల ఈ సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంది. థియేట్రికల్ రన్ కు తోడు యాడ్-ఆన్ బిజినెస్ కూడా బాగా జరగడంతో సూర్యకాంతం లాభాల బాట పట్టింది.

ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఇది సూర్యకాంతంకు అడ్వాంటేజ్ గా మారింది. విడుదలైన ఈ రెండు రోజుల్లో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రూపాయలకు పైగా నెట్ వచ్చింది. ఆదివారం కూడా మల్టీప్లెక్సుల్లో సినిమాకు మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

లాంగ్ రన్ లో ఈ సినిమా కోటి రూపాయల షేర్ రాబట్టవచ్చని ట్రేడ్ భావిస్తోంది. దీనికితోడు శాటిలైట్ రూపంలో కూడా సూర్యకాంతం అదరగొట్టింది. జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను 2 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. సో.. ఎలా చూసుకున్నా సూర్యకాంతం సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంది. అయితే సినిమా మాత్రం హిట్ కాదు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. స్మాల్ బడ్జెట్ కాబట్టి సేఫ్ అనిపించుకుందంతే.

Tags:    
Advertisement

Similar News