'మజిలీ' వేడుకలో వెంకీ మామ

పెళ్లికి ముందు సమంతా నాగచైతన్య కలిసి ‘ఏ మాయ చేసావే’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. కానీ పెళ్లయిన తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న మొట్ట మొదటి సినిమా కాబట్టి ‘మజిలీ’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. ఈ సినిమా ఏప్రిల్ 5న […]

Advertisement
Update:2019-03-27 04:23 IST

పెళ్లికి ముందు సమంతా నాగచైతన్య కలిసి ‘ఏ మాయ చేసావే’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. కానీ పెళ్లయిన తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న మొట్ట మొదటి సినిమా కాబట్టి ‘మజిలీ’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇంకా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ పనులను మొదలు పెట్టింది చిత్రబృందం.

ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు దర్శక నిర్మాతలు. మార్చి 30 వ తేదీన హైదరాబాద్ లో ‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్టరీ వెంకటేష్ రానున్నట్లు సమాచారం. వరుసకు వెంకీ నాగచైతన్యకు మేనమామ అవుతాడు అని తెలిసిన విషయమే. ఇంతకుముందు నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో వెంకీ ఒక స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ‘మజిలీ’ సినిమా వేడుకకు వెంకీ విచ్చేయనున్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే నాగ చైతన్య, వెంకటేష్ కలిసి ‘వెంకీ మామ’ అనే ఒక మల్టీస్టారర్ సినిమా లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News