మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం... నలుగురు మావోయిస్టులు మృతి

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన యాంటీ నక్సల్ బృందాలు గాలింపు చేపట్టాయి. నక్సలైట్ల కంచుకోటగా ఉన్న చత్తీస్‌గడ్‌లోని బస్తర్ దండకారణ్యంలో ఇవాళ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. కర్కాన్‌గూడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోబ్రా టీం ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని.. ఆ […]

Advertisement
Update:2019-03-26 07:20 IST

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన యాంటీ నక్సల్ బృందాలు గాలింపు చేపట్టాయి. నక్సలైట్ల కంచుకోటగా ఉన్న చత్తీస్‌గడ్‌లోని బస్తర్ దండకారణ్యంలో ఇవాళ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.

కర్కాన్‌గూడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోబ్రా టీం ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని.. ఆ తర్వాతే ఎంత మంది చనిపోయారో తెలుస్తుందని భద్రతా దళాల బృందాలు చెప్పాయి.

కాగా, మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. పాల్వంచ మండలం జగన్నాథపురంలో ఈ పోస్టర్లను అతికించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆ పోస్టర్‌లో ఆరోపించారు. 17వ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News