ఓటర్ ని వాడుకోనున్న మోహన్ బాబు?

మోహన్ బాబు ప్రముఖ నటుడు, విద్యావేత్త. తిరుపతి లో శ్రీ విద్యానికేతన్ ని స్థాపించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కి పునాదులు వేస్తున్నారు. అయితే తమ విద్యా సంస్థ కి రావాల్సిన ఫీజులని ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది అని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన మోహన్ బాబు ఒక శాంతియుతమైన ర్యాలీ చేద్దాం అనుకుంటే పోలీసులు అతడిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే విషయాన్ని మోహన్ బాబు స్వయం గా వెల్లడించారు… “ఫీజ్ రీయంబర్స్ […]

Advertisement
Update:2019-03-25 07:31 IST

మోహన్ బాబు ప్రముఖ నటుడు, విద్యావేత్త. తిరుపతి లో శ్రీ విద్యానికేతన్ ని స్థాపించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కి పునాదులు వేస్తున్నారు. అయితే తమ విద్యా సంస్థ కి రావాల్సిన ఫీజులని ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది అని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన మోహన్ బాబు ఒక శాంతియుతమైన ర్యాలీ చేద్దాం అనుకుంటే పోలీసులు అతడిని హౌస్ అరెస్ట్ చేశారు.

ఇదే విషయాన్ని మోహన్ బాబు స్వయం గా వెల్లడించారు… “ఫీజ్ రీయంబర్స్ మెంట్ కొరకై ఒక శాంతియుతమైన ర్యాలీ ని విద్యార్థుల తో కలిసి చేపట్టాలని అనుకున్నాను. కానీ పోలీసులు మా ఇంటికి వఛ్చి నన్ను బయటకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు ఎందుకు చెల్లించడం లేదు?” అని ప్రశ్నలు సంధించిన నేపథ్యం లో…. ప్రభుత్వం కూడా… ఎంత బకాయి పడ్డదన్న విషయాన్ని వెల్లడించింది.

ఇందుకు కౌంటర్ ఇచ్చేవిధం గా మోహన్ బాబు ఇప్పుడు తన ఇద్దరు కుమారుల తో కలిసి ఎలాగైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకం గా తమకి న్యాయం జరిగేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే విష్ణు సినిమా ఓటర్ సినిమా త్వరలో విడుదల కానున్నది. అది కూడా పొలిటికల్ సినిమా, అందులో దీనికి సంబంధించి ఒక ఎపిసోడ్ ఉందట. దీని ద్వారా ప్రజలకి మోహన్ బాబు ప్రభుత్వ వైఖరి పై ఒక మెసేజ్ ఇధ్ధాం అనుకుంటున్నారు అనేది ఫిలింనగర్ వర్గాల నుంచి వస్తున్న వార్త.

Tags:    
Advertisement

Similar News