త్రిదోష హారిణి.... కరక్కాయ....

త్రిదోష హారిణి. అంటే మూడు దోషాలను పోగొట్టేది అని అర్ధం. ఆయుర్వేద వైద్యంలో కరక్కాయకు ఎన్నో రోగాలను దారికి తీసుకువచ్చేదిగా పేరుంది. కరక్కాయలో తీపి, వగరు, చేదు రుచులు సమ్మిళితంగా ఉంటాయి. అందుకే ఇది త్రిదోష హారిణి అని పేరు తెచ్చుకుంది. కరక్కాయను తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుందని వైద్య శాస్త్రంలో ఉంది. ముందుగా కరక్కాయ తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు అదుపులోకి వస్తాయో చూద్దాం. కరక్కాయ తీసుకోవడం వల్ల మూలశంక, కంటి సంబంధిత వ్యాధులు, […]

Advertisement
Update:2019-03-25 02:45 IST

త్రిదోష హారిణి. అంటే మూడు దోషాలను పోగొట్టేది అని అర్ధం. ఆయుర్వేద వైద్యంలో కరక్కాయకు ఎన్నో రోగాలను దారికి తీసుకువచ్చేదిగా పేరుంది.

కరక్కాయలో తీపి, వగరు, చేదు రుచులు సమ్మిళితంగా ఉంటాయి. అందుకే ఇది త్రిదోష హారిణి అని పేరు తెచ్చుకుంది.

కరక్కాయను తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుందని వైద్య శాస్త్రంలో ఉంది. ముందుగా కరక్కాయ తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు అదుపులోకి వస్తాయో చూద్దాం.

  • కరక్కాయ తీసుకోవడం వల్ల మూలశంక, కంటి సంబంధిత వ్యాధులు, పాండు రోగం, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధులు నయం అవుతాయి.
  • ఆయాసం, దగ్గు, అజీర్ణం, తలనొప్పి, వికారంతో పాటు విపరీతంగా వేధించే మైగ్రేన్ నుంచి కూడా ఉపసమనం కలుగుతుంది.
  • కరక్కాయను పొడి చేసి ఆ పొడికి కొద్దిగా ఉప్పు కలిపి ఆ పౌడర్ తో పళ్ళు తోముకుంటే పంటికి సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి. పిప్పి పళ్లు కూడా తగ్గుముఖం పడతాయి.
  • కరక్కాయని బెల్లంతో కలిపి తింటే వాతం వంటి వ్యాధి సోకకుండా ఉంటుంది.
  • కరక్కాయను పంచదారతో కాని తేనెతో కాని కలిపి తీసుకుంటే చాతిలో పేరుకుపోయిన కఫం… అజీర్ణం వంటివి తగ్గుతాయి.

కరక్కాయను ఏ రుతువులో దేనితో తీసుకుంటే మంచిదో చూద్దాం.

  • కరక్కాయను వసంత రుతువు (ఏప్రిల్, మే )లో తేనెతో, గ్రీష్మ రుతువు (జూన్, జూలై) లో బెల్లంతోను, వర్ష రుతువు (అగస్ట్, సెప్టెంబర్) లో సైంధవ లవణంతోను, శరత్ రుతువు (అక్టోబర్, నవంబర్ )లో పంచదారతోనూ, హేమంత రుతువు (డిసెంబర్, జనవరి) లో సొంటితోను, శిశిర రుతువు (ఫిబ్రవరి, మార్చ్ )లో పిప్పళ్లతోను తీసుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవు. ఇక ఉదయాన్నే ఒక చెంచా తీసుకుంటే సమస్త వ్యాధులు తగ్గుతాయి అని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.
  • కరక్కాయను అరగదీసి తలకి కాని, కళ్ల పైభాగంలో కాని రాసుకుంటే తలనొప్పి, కళ్ల నుంచి నీరు కారడం వంటివి తగ్గుతాయి.
  • కరక్కాయ పొడిని రోజూ ఒక చెంచా తీసుకుంటే జుట్టు తెల్లబడడాన్ని నిలువరిస్తుంది. కరక్కాయ కాల్చినప్పుడు వచ్చే పొగని పీలిస్తే చాతిలో పేరుకుపోయిన కఫం తగ్గడమే కాకుండా ఉబ్బసం, ఆయాసం, ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తగ్గుతాయి.
Tags:    
Advertisement

Similar News