వైభవంగా వెంకటేష్ కూతురు పెళ్లి

సెలబ్రిటీస్ అంతా డెస్టినేషన్ వెడ్డింగ్ ఇష్టపడుతున్నారు. మీడియా గోల ఉండదు. లిమిటెడ్ గెస్టులు ఉంటారు. ప్రైవసీ ఫుల్ గా ఉంటుంది. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది సూపర్ గా క్లిక్ అయింది. ఇప్పుడు వెంకటేష్ కూతురు కోసం కూడా ఇదే పంథా ఫాలో అయ్యారు. అవును.. వెంకీ కూతురు దగ్గుబాటి ఆశ్రిత పెళ్లి వేడుక జైపూర్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. నిన్న రాత్రి నుంచే ఈ పెళ్లికి సంబంధించిన హంగామా ప్రారంభమైంది. నిన్న జరిగిన సంగీత్ కు […]

Advertisement
Update:2019-03-24 01:37 IST

సెలబ్రిటీస్ అంతా డెస్టినేషన్ వెడ్డింగ్ ఇష్టపడుతున్నారు. మీడియా గోల ఉండదు. లిమిటెడ్ గెస్టులు ఉంటారు. ప్రైవసీ ఫుల్ గా ఉంటుంది. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది సూపర్ గా క్లిక్ అయింది. ఇప్పుడు వెంకటేష్ కూతురు కోసం కూడా ఇదే పంథా ఫాలో అయ్యారు. అవును.. వెంకీ కూతురు దగ్గుబాటి ఆశ్రిత పెళ్లి వేడుక జైపూర్ లో అట్టహాసంగా ప్రారంభమైంది.

నిన్న రాత్రి నుంచే ఈ పెళ్లికి సంబంధించిన హంగామా ప్రారంభమైంది. నిన్న జరిగిన సంగీత్ కు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యాడు. వెంకీ-సల్మాన్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ముంబయి నుంచి ప్రత్యేకంగా ఈ పెళ్లి కోసం పూణె వచ్చాడు సల్మాన్.

ఇక టాలీవుడ్ నుంచి చాలా కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఎలాగూ బంధువులే అవుతారు కాబట్టి నాగచైతన్య-సమంత హాజరయ్యారు. బయట వ్యక్తుల విషయానికొస్తే రామ్ చరణ్ ఈ పెళ్లికి ప్రత్యేకంగా హాజరయ్యాడు. ఇంకా ఎవరెవరు హాజరయ్యారనే విషయంపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ పెళ్లిని చాలా గుంభనంగా, అత్యంత రహస్యంగా చేసేస్తున్నారు. వెంకీకి సహజంగా పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. అందుకే కూతురు పెళ్లిని ఇలా మీడియాకు దూరంగా చేస్తున్నాడు.

https://www.instagram.com/p/BvVflO4H5CQ/

https://www.instagram.com/p/BvVf7SnnfgQ/

Tags:    
Advertisement

Similar News