టేబుల్ ప్రాఫిట్ తో వస్తున్న జెర్సీ

కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అయింది. దేవదాస్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కానీ ఆ ప్రభావం నాని నటిస్తున్న జెర్సీ సినిమాపై పడలేదు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో బ్రహ్మాండమైన బిజినెస్ చేసింది. ఈ సినిమాను అటుఇటుగా 22 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే, ఏకంగా 40 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది జెర్సీ. ఆంధ్రాలో ఈ సినిమాను 12 కోట్లకు అమ్మారు. నైజాంలో 7 కోట్ల రూపాయలకు అమ్మినట్టు […]

Advertisement
Update:2019-03-24 01:52 IST

కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అయింది. దేవదాస్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కానీ ఆ ప్రభావం నాని నటిస్తున్న జెర్సీ సినిమాపై పడలేదు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో బ్రహ్మాండమైన బిజినెస్ చేసింది. ఈ సినిమాను అటుఇటుగా 22 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే, ఏకంగా 40 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది జెర్సీ.

ఆంధ్రాలో ఈ సినిమాను 12 కోట్లకు అమ్మారు. నైజాంలో 7 కోట్ల రూపాయలకు అమ్మినట్టు టాక్. ఓవర్సీస్ ను ఏకంగా నాలుగున్నర కోట్లకు అమ్మేశారు. అయితే ఆంధ్రా నుంచి కృష్ణా, గుంటూరు మాత్రం తమ వద్దనే ఉంచుకున్నారు నిర్మాతలు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కెరీర్ లో ఫస్ట్ టైం ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిన సినిమా చేశాడు నాని. అవును.. ఈ సినిమాకు నాని పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటా అడిగాడు. నిజంగా సినిమా హిట్ అయితే, నాని రెమ్యూనరేషన్ కంటే దాదాపు 30శాతం ఎక్కువగా అతడికి ముడుతుంది. ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ కంటే 20శాతం తక్కువ ఎమౌంట్ వస్తుంది. ప్రస్తుతానికైతే సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. సినిమా రిజల్ట్ ఏంటనేది ఏప్రిల్ 19న తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News