వెంకీ కూతురి పెళ్లికి పిలవలేదు అని.... హర్ట్ అయిందట

కొన్నాళ్ల పాటు కాస్టింగ్ కౌచ్ విషయమై ఎటు చూసినా శ్రీ రెడ్డి పేరే వినపడేది. గత కొంతకాలంగా ఈమె కోలీవుడ్ పై కన్నెయ్యడంతో టాలీవుడ్ లో అంతగా హడావిడి చేయలేదు. అయితే మళ్ళీ తన పాత రూట్ లోకి వచ్చేసింది శ్రీ రెడ్డి. సోషల్ మీడియా లో విపరీతంగా యాక్టీవ్ గా ఉంటున్న ఈ భామ అలిగాను అంటూ బుంగమూతి పెట్టింది. “ఏం లేదు మరేమో నేను ఎందుకు అలిగానంటే, మా చిన్న మామయ్య అదేనండీ హీరో […]

Advertisement
Update:2019-03-21 05:27 IST

కొన్నాళ్ల పాటు కాస్టింగ్ కౌచ్ విషయమై ఎటు చూసినా శ్రీ రెడ్డి పేరే వినపడేది. గత కొంతకాలంగా ఈమె కోలీవుడ్ పై కన్నెయ్యడంతో టాలీవుడ్ లో అంతగా హడావిడి చేయలేదు.

అయితే మళ్ళీ తన పాత రూట్ లోకి వచ్చేసింది శ్రీ రెడ్డి. సోషల్ మీడియా లో విపరీతంగా యాక్టీవ్ గా ఉంటున్న ఈ భామ అలిగాను అంటూ బుంగమూతి పెట్టింది.

“ఏం లేదు మరేమో నేను ఎందుకు అలిగానంటే, మా చిన్న మామయ్య అదేనండీ హీరో వెంకటేష్ గారి పాప పెళ్ళికి నాకు కార్డు ఇవ్వలేదు. పిలవలేదు. నేను అఫీషియల్ కోడల్ని కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా కోడల్నే కదా. నన్ను కూడా పిలిచి ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.

ఇక్కడితో ఆగకుండా, వెంకీ కూతురికి తన ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేసింది శ్రీ రెడ్డి. “వెంకటేష్ బాబు గారి పాప పెళ్లి సెట్ అయ్యింది. లవ్ కమ్ ఆరెండ్జ్ మ్యారేజ్, ఆ అమ్మాయిని చేసుకోబోయే వ్యక్తి రెడ్డీస్ అబ్బాయ్. వెంకటేష్ గారు, మీ పాపా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ ఆశీర్వాదం కూడా ఇచ్చింది శ్రీ రెడ్డి.

మొత్తానికి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు సెలెబ్రిటీలపై ఒక కన్ను వేసి ఉంచడమే కాక వారిపై వ్యాఖ్యలు కూడా చేస్తోంది శ్రీ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News