వైసీపీలో చేరుతున్నా....
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే వైసీపీ నేతలతో చర్చల అనంతరం వైసీపీలో చేరుతున్నట్టు డీఎల్ ప్రకటించారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటానని వెల్లడించారు. తాను ఎన్నో ఏళ్లుగా వైఎస్ కుటుంబంలో ఒక సభ్యుడినని డీఎల్ చెప్పారు. డీఎల్ వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2014లో టీడీపీ మైదుకూరు అభ్యర్థి పుట్టాసుధాకర్ యాదవ్… డీఎల్ మద్దతు తీసుకున్నారు. కానీ […]
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని ప్రచారం సాగింది.
అయితే వైసీపీ నేతలతో చర్చల అనంతరం వైసీపీలో చేరుతున్నట్టు డీఎల్ ప్రకటించారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటానని వెల్లడించారు. తాను ఎన్నో ఏళ్లుగా వైఎస్ కుటుంబంలో ఒక సభ్యుడినని డీఎల్ చెప్పారు. డీఎల్ వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
2014లో టీడీపీ మైదుకూరు అభ్యర్థి పుట్టాసుధాకర్ యాదవ్… డీఎల్ మద్దతు తీసుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత డీఎల్‌ను, ఆయన వర్గాన్నీ దెబ్బతీసేందుకు పుట్టా ప్రయత్నిస్తూ వచ్చారు. చంద్రబాబు కూడా డీఎల్‌కు ఈ ఎన్నికల్లో మైదుకూరు టికెట్ ఇస్తామంటూ ఆశపెడుతూ వచ్చారు. చివరకు పుట్టా సుధాకర్ యాదవ్‌కే టికెట్ ఇచ్చారు.
డీఎల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు.